Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బలమైన రాజు ఉన్నా.. బలహీనమైన సైనికులతో యుద్దం గెలవలేం! రోహిత్ శర్మది అదే పరిస్థితి: మహమ్మద్ కైఫ్

Mohammad Kaif says You may be a big king, but if your soldiers are weak you will lose the battle

ముంబై: ఎంతటి బలమైన రాజు అయినా బలహీనమైన సైనికులతో యుద్దం గెలవలేడని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మది అదే పరిస్థితని అభిప్రాయపడ్డాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ మ్యాచ్‌పై స్పోర్ట్స్ కీదా చానెల్‌తో మాట్లాడిన మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతటి గొప్ప కెప్టెన్ అయినా సరైన ఆటగాళ్లు లేకపోతే ఏం చేయలేడని, హ్యాట్రిక్ పరాజయాలకు రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఏం సంబంధం లేదన్నాడు.

బలహీనమైన సైనికులు..

బలహీనమైన సైనికులు..

'ఎంత గొప్ప కెప్టెన్ అనేది ముఖ్యం కాదు. నా దృష్టిలో రోహిత్ శర్మ గొప్ప సారథి. అయితే సరైన ఆటగాళ్లు లేకుంటే ఎంతటి గొప్ప కెప్టెన్ అయినా ఏం చేయలేడు. బలహీనమైన సైనికులతో బలమైన రాజు యుద్దం ఓడినట్లు ఉంటుంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. ఈ సీజన్‌ మెగా వేలంలో ఆ జట్టు మేనేజ్‌మెంట్ తమ మార్క్ చూపించలేకపోయింది. సరైన బౌలర్లను తీసుకోవడంలో విఫలమైంది. ఇతర జట్లు పెద్దగా ఆసక్తి చూపని డానియల్ సామ్స్, బసిల్ థంపి, టైమల్ మిల్స్‌లను తీసుకొంది.

బుమ్రా ఒక్కడే..

బుమ్రా ఒక్కడే..

అప్పుడెప్పుడో టైమల్ మిల్స్ ఆర్‌సీబీకి ఆడగా.. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఈ బలహీనమైన బౌలింగ్ లైనప్ కారణంగా బుమ్రాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అతను తన సాయశక్తులా పోరాడుతున్నాడు. కానీ ప్రత్యర్థి లక్ష్యం చాలా చిన్నదయ్యింది. కనీసం ఆ జట్టు 180 పరుగులైనా చేసుంటే.. బౌలర్లకు పోరాడే ఆస్కారం లభించేది. లీగ్‌లో ముందుకు సాగాలంటే ఆ జట్టు బెంచ్ టాలెంట్‌కు అవకాశం ఇవ్వాలి.

9 మ్యాచ్‌లు గెలవాలి..

9 మ్యాచ్‌లు గెలవాలి..

అయితే గతంలో వరుసగా 5, 6 మ్యాచ్‌లు ఓడినా కూడా ముంబై టైటిల్ గెలిచింది. కాబట్టి ఆశలు వదులుకోకుండా పోరాడాలి. అయితే ఆ జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉన్నదనే విషయం వాస్తవం. అయితే గత సీజన్‌లో 6, 7 మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. కానీ ఈసారి 8 నుంచి 9 మ్యాచ్‌లు గెలిచినా టాప్ 4లో నిలవడం కష్టం. ఇది ముంబైకి మరో సవాల్.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, April 7, 2022, 15:38 [IST]
Other articles published on Apr 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+