Mohammad Kaif: అందుకే విరాట్ కోహ్లీ ఐసీసీ టైటిల్ గెలవలేదు

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంపై మాజీ బ్యాట్స్‌మన్ మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ సారథ్యంలోని జట్టు కూర్పు అంశంలో క్లారిటీ ఉండదని, ఎప్పుడు ఎవడికి ఎందుకు ఉద్వాసన పలుకుతారో కూడా తెలియనిస్థితిలో ఆటగాళ్లు ఉంటారని తెలిపాడు.
జట్టు ఎంపిక విషయంలో కోహ్లీ అండ్ కో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే అధిక ప్రాధాన్యం ఇస్తారని, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని చెప్పుకొచ్చాడు. తాజాగా స్పోర్ట్స్ తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్ కోహ్లీ కెప్టెన్సీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలా స్పష్టత లేని ఎంపికల కారణంగానే కోహ్లీ ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోయాడని చెప్పుకొచ్చాడు.

ఫామ్‌లో ఉండే వారికే..
'ఆటగాళ్ల నిలకడైన ప్రదర్శనను గతంలో పరిగణనలోకి తీసుకునేవాళ్లు. కానీ ప్రస్తుత కెప్టెన్, మేనేజ్‌మెంట్ అలా కాదు. ఇప్పుడు ఎవరు ఫామ్‌లో ఉంటే వారినే తుదిజట్టులోకి తీసుకుంటారు. అందుకే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లాంటి వారికి అవకాశాలు వచ్చాయి. అదే విధంగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్‌లు మిస్ కావాల్సి వచ్చింది. 'అని కైఫ్ తెలిపాడు.
కైఫ్ చెప్పినట్లుగానే ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో శిఖర్ ధావన్‌ను తొలి మ్యాచ్ తర్వాత పక్కనపెట్టారు. రోహిత్ శర్మకు కొన్ని మ్యాచ్‌లు విశ్రాంతినిచ్చి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు కోహ్లీ అవకాశం ఇచ్చాడు. అతని ప్లాన్ వర్కౌట్ అయింది. కానీ ధావన్ చేసిన తప్పేం లేదు. ఇప్పటికీ ఈ తరహా సెలెక్షన్‌ను కోహ్లీ చేస్తూనే ఉన్నాడు.

దాదా అండగా ఉండేవాడు..
ఇక బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కెప్టెన్సీతో, కోహ్లీ సారథ్యాన్ని పోలుస్తూ.. ''గంగూలీ తన జట్టుకు ఎంతో మద్దతునిచ్చేవాడు. కొన్నిసార్లు ఆటగాళ్లు విఫలమైనా మరో అవకాశం ఇచ్చి మంచి ఫలితాలు రాబట్టేవాడు. మీ వెనుక నేనున్నానంటూ తనదైన క్లాసిక్ స్టైల్‌తో తుదిజట్టును ఎంపిక చేసుకునేవాడు. అది నాయకుడి లక్షణం. కానీ, కోహ్లి అలాకాదు. జట్టులో ఎవరికీ సుస్థిరస్థానం అంటూ ఉండదు. ఈ విషయాన్ని మనందరం ఆమోదించాలి.

అందుకే ఐసీసీ టైటిల్ లేదు..
గత ప్రదర్శననను పరిగణనలోకి తీసుకోకుండా.. ఒకటీ రెండు మ్యాచ్‌ల్లో రాణిస్తే వారిని ఎంపిక చేసుకుంటాడు. అయితే, దీర్ఘకాలంలో ఇలాంటి నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. బహుశా ఇలాంటి వాటి వల్లే తను ఇంతవరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడు. ఏదేమైనా... ఒక కెప్టెన్‌గా ఎన్ని ఇంటర్నేషనల్ టైటిల్స్ గెలిచారన్న దానినే ఎక్కువగా హైలెట్ చేస్తారు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
ఇక కైఫ్ చెప్పినట్లుగానే 2019 వన్డే ప్రపంచకప్ ముందు కోహ్లీసేన ఆటగాళ్లతో మ్యూజికల్ చైర్ ఆట ఆడింది. నాలుగో స్థానంలో రహానే, రాయుడలను ఆడించి చివరకు సరైన ఆటగాడిని ఎంపిక చేసుకోకుండా మెగా ఈవెంట్‌లో మూల్యం చెల్లించుకుంది. ఇక శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం శ్రీలంకకు వెళ్లగా.. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications