Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఫైనల్‌కు ముందే పృథ్వీ షాను పక్కకు తీసుకెళ్లి మరి చెప్పా: మహ్మద్ కైఫ్

Mohammad Kaif recalls the advice he gave to Prithvi Shaw ahead of Tour Down Under

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో నాటకీయంగా 36 పరుగులకే కుప్పకూలి ఇజ్జత్ తీసుకున్న భారత జట్టు.. 8 వికెట్లతో తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్పటి వరకు పటిష్టంగా ఉన్న జట్టు కథ.. 16 ఓవర్లలోనే తారుమారైంది. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసిన అప్రతిష్టను కోహ్లీసేన మూటగట్టుకుంది. ఇక ఈ ఓటమి నేపథ్యంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో 0, 4తో దారుణంగా విఫలమైన టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతని కారణంగానే భారత్ ఘోరపరాజయానికి గురైందని గిల్ క్రిస్ట్ వంటి మాజీ ఆటగాళ్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తదుపరి మ్యాచ్‌కు అతన్ని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తన టెక్నిక్‌ను మార్చుకోమని, ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలని ఐపీఎల్ 2020 ఫైనల్‌కు ముందే పృథ్వీషాకు చెప్పానని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తెలిపాడు.

ఓ కోచ్‌గా ముందే చెప్పా..

ఓ కోచ్‌గా ముందే చెప్పా..

ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ అయిన కైఫ్.. ఐపీఎల్‌లోనూ పృథ్వీ షా ఇలాంటి సమస్యను ఎదుర్కోవడంతో ఫైనల్ మ్యాచ్‌కు ముందు పక్కకు తీసుకెళ్లి మాట్లాడానని, తన కెరీర్‌ను ఉదహారణగా పేర్కొంటూ విలువైన సలహాలు ఇచ్చానని తాజాగా సోనీ నెట్ వర్క్ చానెల్‌లో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నాడు.

‘మంచి బంతులు ఆడేటప్పుడు మన టెక్నిక్ ఉపయోగపడుతుంది. కానీ కదిలే బంతులపై కూడా అదే టెక్నిక్‌ను ఉపయోగిస్తానంటే మాత్రం కుదరదు. భారత జట్టులో పృథ్వీ షా ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాడు.

ఫస్ట్ మ్యాచ్ కావడంతో..

ఫస్ట్ మ్యాచ్ కావడంతో..

అతను స్టార్క్, కమిన్స్ వంటి ప్రపంచశ్రేణి బౌలర్లను ఎదుర్కొంటున్నాడు. వారు గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతిని విసురుతారు. అలాగే షాకు ఇది మొదటి పింక్ బాల్ మ్యాచ్. అంతేకాకుండా అది ఆసీస్ గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో అతనికి కష్టంగా మారింది. అతని ఫిట్‌నెస్ విషయానికి వస్తే.. ఐపీఎల్ సమయంలోనే పక్కకు తీసుకెళ్లి విలువైన సలహాలు ఇచ్చాను. నేను ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే కోచ్‌ను కాదు. వారి ఆలోచనలు, ప్రణాళికలతో కలిసి పనిచేసేవాడిని. అందుకే అతనితో మాట్లాడాను.

నెట్స్‌లో ఎక్కువ సమయం..

నెట్స్‌లో ఎక్కువ సమయం..

పరుగులు చేస్తున్నప్పుడు నెట్స్‌లో తక్కువ సేపు ఉన్నా ఏం కాదు. కానీ విరామాలు వచ్చినప్పుడు, ఫామ్ కోల్పోయినప్పుడు, పరుగులు చేయలేకపోతున్నప్పుడు నెట్స్‌లో మరింత ఎక్కువ చెమటోడ్చాలి. సచిన్ , ద్రవిడ్, నాతో సహా అందరూ ఆటగాళ్లు ఇదే సూత్రాన్ని పాటించేవారు. మరింత సమయాన్ని కేటాయిస్తూ కష్టపడేవాళ్లం. కొత్త బంతితో ఆడాలనుకున్నప్పుడు బౌలర్లను పిలిచి నెట్స్‌లో మరింత శ్రమించాలి. ఇక ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలని పృథ్వీషాకు చెప్పాను. క్యాచ్‌లు పట్టడాన్ని మరింత ప్రాక్టీస్ చేయమన్నాను. బ్యాటింగ్, రన్నింగ్, జిమ్ ట్రైనింగ్‌కు ఎక్కువ సమయం కేటాయించాలని సూచించా.

 నా అనుభవాన్నే..

నా అనుభవాన్నే..

అలాగే నీ మనస్సును కూడా ప్రశాంతంగా ఉండటానికి కావాల్సిన ట్రైనింగ్ చేయమని చెప్పా. నాట్‌వెస్ట్ ట్రోఫీలోని నా అనుభవాన్ని ఉదహారణగా వివరించా. టెక్నికల్‌గా నేనం బలవంతుడిని కాదు. కానీ మానసిక బలం, పోరాడగలననే సంకల్పంతో మ్యాచ్‌ను పూర్తి చేశాను. ఇదంతా నెట్స్‌లో కష్టపడటం వల్లే సాధ్యమైందని పృథ్వీకి అర్థమయ్యేలా చెప్పా. అలాగే విరాట్ కోహ్లీ ఇంకా పెద్ద ఉదహారణ. ఫిట్‌నెస్ వర్క్‌తో నీ మనస్సును సంసిద్దం చేసుకుంటే.. నువ్వు కష్టాలపాలైనా.. ఫామ్ కోల్పోయినా.. టెక్నిక్ లోపం ఉన్నా అధిగమించవచ్చని అతను నిరూపించాడు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, December 21, 2020, 18:20 [IST]
Other articles published on Dec 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+