Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్, లక్ష్మణ్ మధ్య ఉన్న తేడా అదే: మహమ్మద్ కైఫ్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్‌‌ల మధ్య ఉన్న తేడాను మాజీ మహమ్మద్ కైఫ్ వివరించాడు. టీమ్‌కాంబినేషన్‌లో లక్ష్మణ్ పాత విధానాలను అనుసరించడం వల్లే జింబాబ్వే పర్యటనలో సక్సెస్ అయ్యాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. గంభీర్‌లా లక్ష్మణ్ ఆల్‌రౌండర్లపై అధికంగా ఆధారపడలేదని పేర్కొన్నాడు.

డ్రింక్స్ మోయించి ఫామ్‌ కోల్పోయేలా చేశారు: మాజీ క్రికెటర్

డ్రింక్స్ మోయించి ఫామ్‌ కోల్పోయేలా చేశారు: మాజీ క్రికెటర్

గంభీర్ పర్యవేక్షణలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. దాంతో గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. లక్ష్మణ్ పర్యవేక్షణలో జింబాబ్వే పర్యటనలో భారత్ 3-0తో టీ20 సిరీస్ గెలిచింది. దాంతో గంభీర్‌ను తప్పించి లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించాలనే డిమాండ్ వ్యక్తమైంది.

Mohammad Kaif Highlights Key Difference Between Gautam Gambhir and VVS Laxman s Coaching Styles

తాజాగా ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వీవీఎస్ లక్ష్మణ్ జింబాబ్వే పర్యటనలో తుది జట్టు కూర్పులో పాత పద్దతుల్ని అమలు చేశాడు. ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు బౌలర్లను ఆడించాడు. ఎనిమిదో స్థానం కోసం ఆల్‌రౌండర్‌ను ఆడించలేదు. జింబాబ్వేపై విజయం సులువే అని అందరూ అనుకోవచ్చు. కానీ విదేశాల్లో ఆడించడం ఎప్పుడూ ఒత్తిడిగానే ఉంటుంది.

అయితే యూకే పర్యటనలో భారత పేలవ ప్రదర్శనకు గంభీర్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదు. గంభీర్‌తో పాటు కెప్టెన్‌పై కూడా బాధ్యత ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో శుభ్‌మన్ గిల్ జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం.'అని కైఫ్ పేర్కొన్నాడు.

పాక్ బౌలర్‌ను చితక్కొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. స్టేడియం బయట పడ్డ బంతి!(వీడియో)

Also Read

పాక్ బౌలర్‌ను చితక్కొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. స్టేడియం బయట పడ్డ బంతి!(వీడియో)

జింబాబ్వే పర్యటన అనంతరం టీమిండియా స్వల్ప విరామం లభించింది. డబ్ల్యూటీసీ 2027 సైకిల్‌లో భాగంగా రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఆగస్ట్ 15 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా.. నేటి నుంచి వామప్ మ్యాచ్ ఆడనుంది. టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఈ సిరీస్ అగ్నిపరీక్ష.

డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్‌ను టీమిండియా గెలవడం అత్యంత కీలకం. ఎందుకంటే 2024 నుంచి భారత్.. వెస్టిండీస్, బంగ్లాదేశ్‌తో మినహా మరే టెస్ట్ సిరీస్ గెలవలేదు. సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై క్లీన్ స్వీప్ అయ్యింది. గత మూడేళ్లుగా స్పిన్ బౌలింగ్‌ను టీమిండియా సమర్థవంతంగా ఆడలేకపోతుంది. ఈ క్రమంలోనే స్పిన్‌కు అనుకూలంగా ఉండే శ్రీలంక గడ్డపై టీమిండియా ఎలా రాణిస్తుందోననే ఆందోళన నెలకొంది.

Story first published: Friday, August 7, 2026, 11:29 [IST]
Other articles published on Aug 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+