Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: ధ్రువ్ జురెల్‌కు బదులు అతన్ని ఆడించండి: మహమ్మద్ కైఫ్

రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగే తొలి మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్‌కు బదులు సర్ఫరాజ్ ఖాన్‌ను ఆడించాలని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సూచించాడు. ధ్రువ్ జురెల్ కంటే కూడా సర్ఫరాజ్ ఖాన్‌కు స్పిన్ బౌలింగ్‌ను అలవోకగా ఆడుతాడని అభిప్రాయపడ్డాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027లో భాగంగా రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటన వెళ్లిన సంగతి తెలిసిందే. శనివారం(ఆగస్ట్ 15) గాలే వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే శ్రీలంకకు చేరి వామప్ మ్యాచ్ ఆడిన టీమిండియా ఈ సిరీస్ కోసం అన్ని విధాల సిద్దమైంది.

Mohammad Kaif Explains Why He Picks Sarfaraz Khan Over Dhruv Jurel India s Sri Lanka Test Series

సర్ఫరాజ్ ఖాన్ సరైనోడు..

తొలి టెస్ట్ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్.. తన తుది జట్టు అంచనాను వెల్లడించాడు. ధ్రువ్ జురెల్‌కు బదులు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంచుకున్నాడు. 'సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ధ్రువ్ జురెల్‌కు తుది జట్టులో అవకాశం కల్పిస్తారేమో. అతను నిలకడగా రాణించనప్పటికీ.. జట్టులో భాగమని భావిస్తే మాత్రం సర్ఫరాజ్ ఖాన్‌కు నిరాశే ఎదురవుతుంది. అతను అవకాశం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ నా అభిప్రాయం ప్రకారం ధ్రువ్ జురెల్‌కు బదులు సర్ఫరాజ్ ఖాన్‌ను ఆడించాలి. ఎందుకంటే.. ధ్రువ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఖాన్ స్పిన్ బాగా ఆడుతాడు.

సుదీర్ఘ ఫార్మాట్‌లో పిచ్ కండిషన్స్ అర్థమయ్యే కొద్దీ సర్ఫరాజ్ ఖాన్ రకరకాల షాట్స్ ఆడుతూ తనదైన శైలిలో బ్యాటింగ్‌ను కొనసాగించగలడు. ముఖ్యంగా ఉపఖండపు పిచ్‌ల్లో ఆట నాలుగో లేదా ఐదో రోజు వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా స్పిన్‌కు అనుకూలంగా మారిపోతాయి. ఇలాంటి కండిషన్స్‌లో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతుంది. అప్పుడు సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు బాగా ఉపయోగపడగలడు.

రిషభ్ పంత్ గాశారం బాలేదు.. కానీ టెస్ట్‌ల్లో తిరుగులేదు: మహమ్మద్ కైఫ్

రిషభ్ పంత్ గాశారం బాలేదు.. కానీ టెస్ట్‌ల్లో తిరుగులేదు: మహమ్మద్ కైఫ్

జురెల్ ఫామ్‌లో లేడు

అతను స్వీప్, రివర్స్ స్వీప్, ఎక్స్‌ట్రా కవర్స్, బ్యాక్‌ఫుట్ ఇలా ఏ షాటైనా స్పిన్ బౌలింగ్‌లో ఆడగలడు. మరోవైపు జురెల్ ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. వామప్ మ్యాచ్‌లోనూ అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.

తన జట్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లను ఓపెనర్‌గా ఎంపిక చేసిన కైఫ్.. దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లతో పాటు సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజాలను మిడిలార్డర్‌ బ్యాటర్లుగా ఎంచుకున్నాడు. మానవ్ సుతార్, సారాన్ష్ జైన్‌లో ఒకరికి అవకాశం దక్కుతుందని, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ స్పెషలిస్ట్ బౌలర్లుగా బరిలోకి దిగుతాడని అంచనా వేసాడు.

India Playing XI: ఆ నలుగురికి నిరాశే.. శ్రీలంకతో తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

India Playing XI: ఆ నలుగురికి నిరాశే.. శ్రీలంకతో తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే!

మహమ్మద్ కైఫ్ భారత తుది జట్టు(అంచనా)

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్(కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, సరాన్ష్ జైన్/మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

Story first published: Tuesday, August 11, 2026, 19:47 [IST]
Other articles published on Aug 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+