రిషభ్ పంత్.. సోయితో ఆడాలి కదా: మహమ్మద్ కైఫ్
టీమిండియా టెస్ట్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కామన్‌సెన్స్‌తో బ్యాటింగ్ చేయాలని చురకలంటించాడు. శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రిషభ్ పంత్ చెత్త షాట్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. 62 బంతుల్లో 39 పరుగులే చేసి వెనుదిరిగాడు. అంతకుముందు కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసి విఫలమైనా.. వెనక్కి తగ్గకుండా పేలవ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు.
సోయితో ఆడాలి కదా..?
ఈ క్రమంలో అతని ఆటతీరును కైఫ్ తప్పుబట్టాడు. దూకుడుగా ఆడుదామనే ఉద్దేశం మంచిదే అయినా.. సమయం-సందర్భం చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. 'రిషభ్ పంత్ ఔటైన విధానంపై నేనెలాంటి ఫిర్యాదు చేయడం లేదు. ఎందుకంటే అతను మాత్రమే ఇలా ఆడగలడు. కానీ, నా కంప్లైంట్ ఏంటంటే అతని కామన్‌సెన్స్ గురించే. కొత్త బంతి వచ్చాక అతను ఎదుర్కొన్న తొలి ఓవర్ అది.

అప్పటికే మూడుసార్లు స్టెప్ ఔటై షాట్లు కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ సఫలం కాలేదు. అలాంటప్పుడు కామన్ సెన్స్‌తో ఆడి ఉండుంటే ఫలితం వేరేలా ఉండేది. కొత్త బంతిని కనీసం 5-6 ఓవర్లు ఆచితూచి ఆడాలి. పంతే కాదు ఎవరైనా కామెన్‌సెన్స్‌తో బ్యాటింగ్ చేయాలి.
ఆ మెచ్యూరిటీ లేకుంటే ఎలా..?
కేశర నువాంత వేసిన ఆ ఓవర్‌లో తొలి బంతికే రిషభ్ పంత్ స్టెప్ ఔటై షాట్ ఆడటం నన్ను ఆశ్చర్యపరిచింది. మరోవైపు 150+ పరుగులు చేసిన బ్యాటర్ కూడా కొత్త బంతి వచ్చాక ఆచితూచి ఆడాడు. అలాంటి మెచ్యూరిటి కావాలి. ఈ విషయంలో రిషభ్ పంత్ మార్కుల్లో కోత విధిస్తా. లాజిక్..క్రికెటింగ్ సైన్స్‌ను వదిలేశాడు. అందుకే, షాట్స్ ఎంపికలో జాగ్రత్త వహించాలి.'అని కైఫ్ సూచించాడు.
భారత్ 462 ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్(230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 167) సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(175 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య(4/109) నాలుగు వికెట్లు తీయగా.. కేశర నువాంత(3/175) మూడు వికెట్లు పడగొట్టాడు. అసితా ఫెర్నాండో(2/63) రెండు వికెట్లు తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

