Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డ్రింక్స్ మోయించి ఫామ్‌ కోల్పోయేలా చేశారు: మాజీ క్రికెటర్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ విమర్శలు గుప్పించాడు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రాన్ని కష్టతరం చేశారని మండిపడ్డాడు. ఐపీఎల్‌లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చి భారత జట్టులో చోటు దక్కించుకుంటే..డ్రింక్స్ మోయించి వైభవ్ ఫామ్ కోల్పోయేలా చేశారని కైఫ్ అసహనం వ్యక్తం చేశాడు.

పంతం నెగ్గించుకున్న గంభీర్..పాపం బుడ్డోడు డ్రింక్స్ బాయ్‌గా..!

పంతం నెగ్గించుకున్న గంభీర్..పాపం బుడ్డోడు డ్రింక్స్ బాయ్‌గా..!

ఐర్లాండ్‌తో సిరీస్‌లో వైభవ్‌కు అవకాశం ఇచ్చి ఉంటే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో దుమ్మురేపేవాడని అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం లేదు. ప్రపంచకప్ గెలిపించిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లకు మేనేజ్‌మెంట్‌ అవకాశాలు కల్పించింది. దాంతో వైభవ్ ఆటగాళ్లకు డ్రింక్స్ అందించాడు.

Mohammad Kaif Criticises India Management for Delaying Vaibhav Sooryavanshi s Debut Says You Made Him Serve Water
Photo Credit: X (twitter)

వైభవ్ మ్యాచ్ విన్నర్..

ఇంగ్లండ్ పర్యటనలో అరంగేట్రం చేసినా.. జోఫ్రా ఆర్చర్ షార్ట్ పిచ్ బాల్స్ ఆడలేక వికెట్ పారేసుకున్నాడు. వరుసగా మూడు టీ20ల్లో విఫలమై తుది జట్టులో చోటు కోల్పోయాడు. జింబాబ్వే పర్యటనలో తన అసలు సత్తా చూపెట్టాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్నాడు.

వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ సరికాదు.. అతనికివ్వాల్సింది: టీమిండియా మాజీ ఓపెనర్

Also Read

వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ సరికాదు.. అతనికివ్వాల్సింది: టీమిండియా మాజీ ఓపెనర్

తాజాగా వైభవ్ అరంగేట్రం గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్.. ఐర్లాండ్ పర్యటనలోనే అతనికి అవకాశం ఇవ్వాల్సిందని చెప్పుకొచ్చాడు. 'వైభవ్ సూర్యవంశీ ఎక్స్-ఫ్యాక్టర్ ఆటగాడు. అతను తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. అందరి దృష్టి అతనిపై ఉన్నప్పటికీ.. ఐపీఎల్‌లో అతని బ్యాటే మాట్లాడింది. అతను ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా టోర్నీ అంతా రాణించాడు. ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అతన్ని ఆడించాల్సింది.

మ్యాచ్ విన్నర్‌తో డ్రింక్స్ మోయించారు..

ఆ సిరీస్‌లో అవకాశం ఇచ్చి ఉంటే అతనిలో ఆందోళన ఉండేది కాదు. అప్పుడు ఇంగ్లండ్ పర్యటనలో సత్తా చాటేవాడు. కానీ ఆరెంజ్ క్యాప్ గెలిచి సూపర్ ఫామ్‌ ఉన్న వైభవ్‌తో టీమిండియా మేనేజ్‌మెంట్ డ్రింక్స్ మోయించింది. అతను ఒక ప్రత్యేకమైన ఆటగాడు. అతన్ని నేరుగా ఐర్లాండ్‌తో ఆడించాల్సింది. అతనికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. అతను ఐర్లాండ్‌లో ఆడి ఉంటే.. యూకేలో ఎలాంటి ఆందోళన లేకుండా బరిలోకి దిగేవాడు.

వైభవ్ సూర్యవంశీ‌తో డ్రింక్స్ మోయించండి.. గంభీర్‌కు అండగా అశ్విన్!

Recommended For You

వైభవ్ సూర్యవంశీ‌తో డ్రింక్స్ మోయించండి.. గంభీర్‌కు అండగా అశ్విన్!

ఇంగ్లండ్ పర్యటనలో అతను సరిగ్గా ఆడలేదు. దాంతో అతన్ని తుది జట్టు నుంచి తప్పించారు. ఆర్చర్ బౌలింగ్‌ను సూర్య ఆడలేకపోయాడు. కానీ భారత్‌లో అతని బౌలింగ్ ఇంకా ఎదుర్కోలేదు. ఇక్కడ ఆడినప్పుడు ఆర్చర్‌‌కు తన బ్యాట్ రుచి చూపిస్తాడు. సూర్యవంశీ అరంగేట్రం కఠినంగా జరిగింది. దానిని మేనేజ్‌మెంట్ మరింత సులభతరం చేసి ఉండాల్సింది. తుది జట్టు నుంచి వైభవ్‌ను తప్పించాల్సింది కాదు. జింబాబ్వేలో అతను ప్లేయర్ ఆఫ్ సిరీస్ గెలుచుకొని తన సత్తా చాటాడు.

Story first published: Wednesday, August 5, 2026, 15:11 [IST]
Other articles published on Aug 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+