బయోసెక్యూర్ రూల్ బ్రేక్.. బామ్మతో దొరికిపోయిన పాక్ క్రికెటర్!!

సౌతాంప్టన్: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్‌లోని ది రోజ్ బౌల్ వేదికగా ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం అయింది. ఈ పర్యటనను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు బయోసెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తోంది. అయితే క్రికెటర్లు బయోసెక్యూర్ నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటికే ఇంగ్లీష్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఉల్లంఘించగా.. తాజాగా పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ ఆ నిబంధనలను బ్రేక్ చేశాడు.

బామ్మతో ఫొటో:
టెస్టు సిరీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మహ్మద్ హఫీజ్.. తాను ఉంటున్న హోటల్ పక్కన ఉన్న గోల్ఫ్ కోర్సుకు వెళ్లాడు. అక్కడ ఓ 90 ఏళ్ల పెద్దావిడ (బామ్మ)తో ఫొటో దిగాడు. ఆ ఫోటోను అతను తన సోషల్ మీడియా అకౌంట్‌లోనూ పోస్టు చేశాడు. దీంతో బయో- సెక్యూర్ బబుల్ రూల్స్‌ని అతడు బ్రేక్ చేశాడు. రెండు మీటర్ల దూరం అన్న సోషల్ డిస్టన్సింగ్ రూల్‌ను హఫీజ్ ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. బయోసెక్యూర్ రూల్‌ను బ్రేక్ చేసిన హఫీజ్‌ను డాక్టర్లు పరీక్షించారు. అతనికి కరోనా టెస్టు కూడా చేశారు. ఆ రిపోర్ట్ ఈరోజు రానుంది.

బయోసెక్యూర్ రూల్ బ్రేక్:
కరోనా నెగటివ్ వచ్చేంత వరకు మహ్మద్ హఫీజ్‌ను ఐసోలేట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. హఫీజ్ ఐసోలేషన్‌లో ఉండనున్న ఐదు రోజుల్లో రెండు సార్లు అతనికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండింటిలోనూ నెగటివ్ వస్తేనే.. పాక్ జట్టులోకి మళ్లీ హఫీజ్‌ని అనుమతిస్తారు. ఫొటోని ట్విట్టర్ పోస్ట్ చేయడంతోనే హఫీజ్ బబుల్ రూల్స్ బ్రేక్ చేసినట్లు తమకి తెలిసిందని పీసీబీ అధికారి ఒకరు చెప్పడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం హఫీజ్చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది. పోస్ట్ ద్వారా దొరికిపోయావా? అని కొందరు, బామ్మతో (బామ్మ కారణంగా) దొరికిపోయిన పాక్ క్రికెటర్ అని మరికొందరు సరదాగా కామెంట్ల వర్షం కురుస్తున్నాయి.

ప్రత్యక్షంగా కలవడానికి వీల్లేదు:
ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు 29 మందితో కూడిన జట్టుని పీసీబీ అక్కడికి పంపిన విషయం తెలిసిందే. సిరీస్‌కి నెల రోజుల ముందే ఆటగాళ్లని ఇంగ్లండ్ రప్పించి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచింది. ఆ తర్వాత రెండు సార్లు వైరస్ పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిని బయో-సెక్యూర్ బబుల్‌లోకి అనుమతించింది. బబుల్ నిబంధనల ప్రకారం.. క్రికెటర్లు ఎవరూ వెలుపలి వ్యక్తుల్ని ప్రత్యక్షంగా కలవడానికి వీల్లేదు. కానీ మహ్మద్ హఫీజ్ గోల్ఫ్ కోర్స్‌లో ఆ పెద్దావిడని కలవడంతో పాటు సామాజిక దూరం పాటించకుండా ఫొటోకి పోజిచ్చాడు. దాంతో మూల్యం చెల్లించుకున్నాడు.

ఆర్చర్ కూడా:
వెస్టిండీస్‌తో తొలి టెస్టు పూర్తయ్యాక జోఫ్రా ఆర్చర్ బయో సెక్యూర్ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించినందుకు.. రెండో టెస్టుకు కొద్ది గంటల ముందు అతన్నిఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. తొలి మ్యాచ్ (సౌతాంప్టన్) అనంతరం ఆటగాళ్లను తమ సొంత కార్లలో నేరుగా మాంచెస్టర్‌కు వెళ్లమని చెప్పగా.. ఆర్చర్ ఆ నిబంధనల్ని పాటించకుండా ఇంటికి వెళ్లినట్లు ఈసీబీ గుర్తించింది. ఆర్చర్ ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఆపై రెండు కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.
England vs Pakistan: రెండో టెస్టుకు వర్షం అంతరాయం.. పాకిస్థాన్ 85/2
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications