Mohammad Azharuddin:ఎలాంటి స్కామ్ జరగలేదు.. ఆ ఘటనతో మాకు సంబంధం లేదు!

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఆదివారం జరగనున్న భారత్Xఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల విషయంలో ఎలాంటి స్కామ్ జరగలేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించినప్పుడు తమ పాత్ర పరిమితంగా ఉంటుందని చెప్పారు. జింఖానా గ్రౌండ్‌లోని మ్యాచ్ టికెట్ల కౌంటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై అజారుద్దీన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనతో హెచ్‌సీఏకు సంబంధం లేదన్నారు. టికెట్ విక్రయాల బాధ్యతను పూర్తిగా హెచ్‌సీఏకు అప్పగించామన్నారు. టికెట్ల అమ్మకాల విషయంలో వచ్చిన ఆరోపణలపై సమాధానాలు ఇచ్చారు.

తప్పుంటే అరెస్ట్ చేయండి..
తాము టికెట్లు బ్లాక్ చేయలేదని.. కాంప్లిమెంటరీ పాసులు ఏవి లేవని వివరించారు. ఇక జింఖానా గ్రౌండ్ దగ్గర ఏం జరిగిందో పోలీసులకు తెలుసని, నిన్న జరిగిన ఘటనకు తాము బాధ్యులము కాదని చెప్పారు. బాధితుల వైద్య ఖర్చులు హెచ్‌సీఏనే భరిస్తుందని చెప్పిన అజారుద్దీన్.. తాను ఏ తప్పు చేయలేదన్నారు. పోలీసులు తమపై కేసులు నమోదు చేస్తే.. తాము పేటీఎంపై కేసులు పెడతామన్నారు. తమ అసోసియేషన్‌లో ఉన్న కొందరూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, మ్యాచ్ పూర్తయ్యాక మరిన్ని విషయాలు చెబుతానన్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రతీ లెక్కా తన దగ్గర ఉందన్నారు. క్రికెట్‌లో ఏబీసీడీలు తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కామెంట్స్‌కు కౌంటరిచ్చారు.
మ్యాచ్ కోసం బ్యాటింగ్ పిచ్..
ఆదివారం జరిగే మ్యాచ్ కోసం మైదానాన్ని పూర్తిగా సిద్దం చేశామని చెప్పారు. ఈ మ్యాచ్ కోసం బ్యాటింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామన్న అజార్.. మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందన్నారు. స్టేడియంలో కొత్తగా డ్రెస్సింగ్ రూమ్స్ నిర్మించామని, తాను వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ పనులు చేయించానని చెప్పారు. ఇక సీట్లను ఇప్పటికప్పుడు పూర్తిగా మార్చలేమని, కరోనా కారణంగా మ్యాచ్‌లు లేక స్టేడియంలో కొన్ని పాడవ్వడం వాస్తవమేనన్నారు. ఉన్నవాటినే క్లీన్ చేసి, మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.

చిన్న చిన్న ఘటనలు..
మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌కు మ్యాచ్ నిర్వహించే అవకాశం లభించిందని, పెద్ద మ్యాచ్ జరిగినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకోవడం సహజమన్నారు. అన్ని విషయాల్లో పర్‌ఫెక్ట్ ఉండటం కుదరదని, కొన్ని తప్పిదాలు జరుగుతాయన్నారు. ఆరోపణలు చేసేవారు ఏం స్కామ్ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు. అభిమానులు వచ్చి మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలన్నారు. టికెట్ల ఘటనపై పూర్తి నివేదికను బీసీసీఐకి అందజేస్తామన్నారు.
ఇక టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎన్ని అమ్మారు? కాంప్లిమెంటరీ పాసులు ఎన్ని అనే విషయాలను అజార్ చెప్పలేదు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పని అజార్.. తాను చెప్పదలుచుకున్నదే చెప్పి అనేక ప్రశ్నలకు సమాధానాలు ధాటవేసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications