Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇలా ఆడితే సరిపోదు.. జట్టులో చోటు దక్కాలంటే సెంచరీలు కొట్టాలి! తెలుగు క్రికెటర్‌కు అజారుద్దీన్ అడ్వైజ్!

Mohammad Azharuddins says Scoring Only 50s, 60s Not Really Going To Help Hanuma Vihari

న్యూఢిల్లీ: తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఇంగ్లండ్ పర్యటనలో రాణించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ సూచించాడు. జట్టులోకి వచ్చి నాలుగేళ్లు అయినా ఇప్పటికీ సుస్థిర స్థానం సంపాదించుకోలేని అతను.. సెంచరీలు సాధిస్తేనే దీర్ఘకాలం జట్టులో కొనసాగుతాడని చెప్పాడు. ఈ 50, 60 పరుగులు చేస్తానంటే సరిపోదన్నాడు.

ఇంగ్లండ్ పర్యటనలో గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ను మళ్లీ నిర్వహిస్తున్నారు. జూలై 1 నుంచి 5 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో హనుమ విహారికి అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలోనే ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అజహరుద్దీన్‌ విహారికి పలు సూచనలు చేశాడు.

సెంచరీలు చేయాలి..

సెంచరీలు చేయాలి..

'హనుమ విహారి భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది. అతను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే సెంచరీలు సాధించాలి. కేవలం 50, 60 పరుగులు సాధిస్తే ప్రయోజనం లేదు. విహారి చాలా మంచి ఆటగాడు. అతను భారీ ఇన్నింగ్స్‌ ఆడితేనే సుదీర్ఘకాలం టీమిండియాలో కొనసాగుతాడు'అని అజారుద్దీన్‌ చెప్పుకొచ్చాడు. కాగా, టీమిండియా గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగు మాత్రమే ఆడింది. 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ చివరి మ్యాచ్‌ను గెలిచినా డ్రా చేసుకున్న సిరీస్ భారత్ వశం కానుంది.

ఒక్క సెంచరీ చేస్తే..

ఒక్క సెంచరీ చేస్తే..

ఇంగ్లండ్‌ సిరీస్‌లో కోహ్లి మరింత బలంగా పుంజుకుంటాడని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. 'విరాట్‌ కోహ్లీ 50కి పైగా పరుగులు చేసినా అతను విఫలమైనట్లు భావిస్తున్నారు. ఎటువంటి స్టార్‌ ఆటగాళ్లుకు అయినా ఏదో ఒక దశలో ఇలాంటి బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. కోహ్లీ కూడా అంతే. అతను గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్‌ ఆడుతున్నాడు. అయితే అతడికి ఇప్పుడు కాస్త విశ్రాంతి లభించింది. కాబట్టి ఇంగ్లండ్‌ సిరీస్‌లో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నాను. కోహ్లీ ఒక సెంచరీ సాధిస్తే.. అతనిలో ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది' అని అజారుద్దీన్ పేర్కొన్నాడు.

ఇంగ్లండ్‌లోనైనా..

ఇంగ్లండ్‌లోనైనా..

ఇక విరాట్‌ కోహ్లీ గత మూడేళ్లుగా ఒక్క సెంచరీ నమోదు చేయలేదు. పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-2022 సీజన్‌లోనూ కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ ఏడాది సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌ 341 పరుగులు మాత్రమే సాధించాడు. కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్నటీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు తిరిగి జట్టులోకి రానున్నాడు. దాంతో ఇంగ్లండ్‌‌లో కోహ్లీ చెలరేగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Story first published: Friday, June 3, 2022, 18:26 [IST]
Other articles published on Jun 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+