Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకున్నా.. అజహరుద్దీన్‌ తనయుడుకి జట్టులో చోటు!!

Mohammad Azharuddins son Asaduddin gets a place in Hyderabad squad for practice matches
Mohammad Azharuddin Shares A Video Of Him Playing Different Shots | Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాద్‌ క్రికెట్ సెలెక్షన్‌ కమిటీ నియామకం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. శివాజీ యాదవ్‌, అహ్మద్‌ ఖాద్రి, అభినవ్‌ కుమార్‌లు సెలెక్షన్‌ కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. ఇలా ఎన్నికయ్యారో లేదో అప్పుడే హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) పెద్దల మనసులను గెలుచుకోవడమే లక్యంగా పెట్టుకుని.. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లకు జట్లను ఎంపిక చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ తనయుడు మహ్మద్‌ అసదుద్దీన్‌ అబ్బాస్‌, కోశాధికారి సురేందర్‌ అగర్వాల్‌ కుమారుడు అలంకృత్‌ అగర్వాల్‌లకు చోటు కల్పించారు.

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో అసదుద్దీన్‌కు చోటు:

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో అసదుద్దీన్‌కు చోటు:

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును ఎంపిక చేసేందుకు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు నిర్వహించాలని హైదరాబాద్‌ సెలెక్షన్‌ కమిటీ నిర్ణయించింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో తలపడే జట్లలో హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ తనయుడు మహ్మద్‌ అసదుద్దీన్‌ అబ్బాస్‌, కోశాధికారి సురేందర్‌ అగర్వాల్‌ కుమారుడు అలంకృత్‌ అగర్వాల్‌లకు చోటు కల్పించింది. అసదుద్దీన్‌ మూడు రోజుల లీగ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇప్పటివరకు చేయలేదు. ఇక అలంకృత్‌ అసలు ఆ లీగ్‌లోనే ఆడలేదు. అయినా వారికి చోటు దక్కింది. శుక్ర, శనివారాల్లో ఉప్పల్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

హెచ్‌‌సీఏలో విభేదాలు?:

హెచ్‌‌సీఏలో విభేదాలు?:

అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలతో ఇప్పటికే పరువు పోగొట్టుకున్నహెచ్‌‌సీఏలో వర్గ పోరు కొనసాగుతూనే ఉంది. మహ్మద్‌‌ అజారుద్దీన్ నేతృత్వంలోని హెచ్‌‌సీఏలో తాజాగా విభేదాలు భగ్గుమన్నాయి. అంబుడ్స్‌‌మన్‌‌ నియామకంపై రచ్చ చల్లారకముందే.. వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) విషయంలో ప్రెసిడెంట్‌‌ అజారుద్దీన్‌‌, సెక్రటరీ విజయానంద్‌‌ మధ్య విభేదాలు వచ్చాయి. ఏజీఎంకు పర్మిషన్‌‌ ఇవ్వాలని సెక్రటరీ, వద్దంటూ ప్రెసిడెంట్‌‌ రాచకొండ పోలీస్‌‌ కమిషనర్‌‌కు వేర్వేరు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రెసిడెంట్‌‌ తనయుడికి జట్టులో చోటివ్వడం ఎలాంటి గొడవలకు దారితీస్తుందో మరి.

ఈడెన్‌ గార్డెన్స్‌ను సందర్శించిన అజ్జూ:

ఈడెన్‌ గార్డెన్స్‌ను సందర్శించిన అజ్జూ:

ఇక హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్ కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‌ను గత ఆదివారం సందర్శించారు.‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీకి ముందు అజారుద్దీన్‌ ఈడెన్‌లో పర్యటించారు. తన టూర్‌లో భాగంగా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్ ‌(క్యాబ్‌) అధ్యక్షుడు అవిశేక్‌ దాల్మియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లాజిస్టిక్స్‌, బయో బబుల్‌ నిబంధనలపై చర్చించారు. ట్రోఫీ జనవరి 10న ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియం ఈ టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

జట్లు:

జట్లు:

శివలాల్‌ ఎలెవన్‌: తన్మయ్‌, చరణ్‌, వరుణ్‌గౌడ్‌, మిఖిల్‌, వైష్ణవ్‌రెడ్డి, ప్రజ్ఞయ్‌రెడ్డి, అసదుద్దీన్‌, శ్రేయస్‌ వాలా, యుధ్‌వీర్‌, రక్షణ్‌రెడ్డి, గణేశ్‌, అనికేత్‌రెడ్డి, సాకేత్‌, అంకుర్‌.

అజహరుద్దీన్‌ ఎలెవన్‌: అక్షత్‌రెడ్డి, రాకేశ్‌, జావీద్‌ అలీ, చందన్‌ సహాని, సుమంత్‌, మల్లికార్జున్‌, అజయ్‌దేవ్‌, అభిరథ్‌రెడ్డి, అనూజ్‌ యాదవ్‌, మెహదీ హసన్‌, ఆశిష్‌ శ్రీవాస్తవ్‌, అలంకృత్‌, విజయ్‌ ఆకాశ్‌, పూర్ణానంద రావు, సూర్య ప్రసాద్‌.

అర్షద్‌ ఎలెవన్‌: తిలక్‌వర్మ, రోహిత్‌ రాయుడు, రాహుల్‌ బుద్ధి, సందీప్‌, చైతన్యరెడ్డి, ప్రతీక్‌రెడ్డి, హిమాలయ్‌ అగర్వాల్‌, రవితేజ, సీవీ మిలింద్‌, కార్తికేయ, విక్రమ్‌ నాయక్‌, తనయ్‌ త్యాగరాజన్‌, ఆకాశ్‌ భండారి, ధీరజ్‌ జైశ్వాల్‌.

ఒడిషాలో ప్రపంచ స్థాయి స్టేడియం.. 2023 ప్రపంచకప్‌నకు ఆతిథ్యం!!

Story first published: Friday, December 25, 2020, 10:37 [IST]
Other articles published on Dec 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+