Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ జరగాలంటే.. క్రికెట్ షెడ్యూల్ మొత్తం మార్చాలి: అజారుద్దీన్

Mohammad Azharuddin Calls For Restructured Cricket Fixtures For 2 Years Due To Coronavirus

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ జరగాలంటే ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ)లో మార్పులు చేయాలని భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ తెలిపాడు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసింది. అయితే దేశంలో లాక్‌డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగించడంతో ఈ క్యాష్ రిచ్ లీగ్ నిరవదిక వాయిదా పడే అవకాశం ఉంది. తుది నిర్ణయం ఈ రోజు (సోమవారం) వెలువడునుంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాదని అజారుద్దీన్ తెలిపాడు. ఒకవేళ పరిస్థితులు చక్కబడ్డాక కూడా పూర్తి స్థాయిలో ఐపీఎల్ నిర్వహించడం కూడా కష్టమేనన్నాడు. పీటీఐ వార్త సంస్థతో మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్‌, ఎఫ్‌టీపీ, ఐపీఎల్‌పై అజారుద్దీన్‌ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు.

రీ షెడ్యూల్ చేయాలి..

రీ షెడ్యూల్ చేయాలి..

‘కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యం లో.. రాబోయే రెండేళ్ల కోసం ముందుగానే నిర్ణయించిన ఎఫ్‌టీపీలో మార్పులు అనివార్యమనిపిస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేరు కాబట్టి.. షెడ్యూల్‌ను తిరిగి రూపొందించాలి. వైరస్‌ ప్రభావం తగ్గితే.. ఆ తర్వాత ఈ అంశంపై ఇతర దేశాలతో చర్చించవచ్చు. ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితి. వాస్తవానికి ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 24 వరకు ఐపీఎల్‌ 13వ సీజన్‌ జరగాల్సి ఉన్నా.. మహమ్మారి కారణంగా రెండు వారాలు వాయిదా వేశారు. అయితే ఇప్పుడున్న స్థితిలో లీగ్‌ నిర్వహణ కష్టమే.

ఐపీఎల్‌ రద్దయితే భారీ నష్టం..

ఐపీఎల్‌ రద్దయితే భారీ నష్టం..

ఈ ఏడాది క్రికెట్‌ షెడ్యూల్‌లో ఐపీఎల్‌కు చోటు కల్పించాలంటే.. మొత్తం అంతర్జాతీయ సిరీస్‌ల తేదీలను మార్చాల్సి ఉంటుంది. లేకపోతే లీగ్‌ను నిర్వహించడం కష్టం. లీగ్‌ రైద్దెతే.. ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీలు, వాటాదారులు తీవ్రంగా నష్టపోతారు. ఆ ప్రభావం బీసీసీఐతో పాటు మిగిలిన దేశాల బోర్డులపై కూడా పడుతుంది. లీగ్‌ కేవలం దేశీయ ప్లేయర్‌లకే కాదు.. విదేశీ ఆటగాళ్లకూ ముఖ్యమైనదే. అందుకే ఎఫ్‌టీపీలో మార్పులు చేసి ఐపీఎల్‌ కోసం స్లాట్‌ ఏర్పాటు చేస్తారనుకుంటున్నా.

టీ20 వరల్డ్‌కప్‌పై ప్రభావం ఉండకపోవచ్చు..

టీ20 వరల్డ్‌కప్‌పై ప్రభావం ఉండకపోవచ్చు..

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరుగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌పై కరోనా వైరస్‌ ప్రభావం ఉండకపోవచ్చనుకుంటున్నా. అక్టోబర్‌ మూడో వారంలో జరుగనున్న మెగాటోర్నీ గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. అయినా అప్పటి వర కు పరిస్థితుల్లో మార్పు వస్తుందనుకుంటున్నా. ప్రపంచకప్‌నకు ఇబ్బంది కలుగకుండా.. ఐపీఎల్‌ కోసం షెడ్యూల్‌లో మార్పు లు చేస్తే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎప్పుడూ మైదానాల చుట్టూ తిరిగే క్రికెటర్లు.. ప్రస్తుత పరిస్థితులో అసహనానికి గురవుతూ ఉంటారు. ప్రాక్టీస్‌ కోసం గంటలు గంటలు వెచ్చించే ఆటగాళ్లకు కనీసం నెట్స్‌ కూడా అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగానే ఉంటుంది. ప్రస్తుతం ఆటలో కొనసాగుతున్న చాలా మంది క్రికెటర్లు తమ సొంత ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌తో ముందుకు సాగుతున్నారు. అం టే వారి ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ వ్యాయామాలు కొనసాగిస్తున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం తగ్గి ఒకసారి పరిస్థితుల్లో మార్పు వస్తే వారం రోజుల్లో అంతా చక్కదిద్దుకుంటుంది.

ఖాళీ మైదానాలైనా సై అంటున్నారు..

ఖాళీ మైదానాలైనా సై అంటున్నారు..

ఖాళీ మైదానాల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడేందుకు కూడా విదేశీ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశాన్ని చాలామంది ఆటగాళ్లు బాహాటంగానే ప్రకటించారు. అంటే వారికి ఈ లీగ్‌ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక్కరి నోటి నుంచి కూడా ‘ఐపీఎల్‌ వద్దు'అనే మాట రాలేదు. ఈ ఏడాదిలో ఎప్పుడో ఒకప్పుడు లీగ్‌ జరిగితే బాగుంటుందనే అంతా భావిస్తున్నారు. దీన్ని నిర్వహకులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరముంది.'అని అజారుద్దీన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, April 13, 2020, 15:02 [IST]
Other articles published on Apr 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+