HCA ఛీటింగ్‌కు అభిమానం రిటైర్డ్ హర్ట్! బ్లాక్ టికెట్ దందాలో అందరూ భాగస్వాములే!

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరగనున్న మూడో టీ20 మ్యాచ్ టికెట్ల కోసం నెలకొన్న గందరగోళంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ల అమ్మకాల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) పూర్తిగా విఫలమైంది. ముందుగా టికెట్లను పేటీఎమ్, పేటీఎమ్ ఇన్‌సైడర్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పిన హెచ్‌సీఏ.. తీవ్ర విమర్శల నేపథ్యంలో గురువారం ఆఫ్‌లైన్‌లో అమ్ముతున్నట్లు ప్రకటించింది. మూడేళ్ల తర్వాత నగరంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో టికెట్ల కోసం వేల సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. ఆన్‌లైన్ టికెట్లు పొందినవారు.. ఆఫ్ లైన్ టికెట్ల కోసం వచ్చినవారు అందరూ జింఖానా మైదానానికి చేరుకున్నారు. ఉదయం 3 గంటల నుంచే లైన్లలో నిలబడ్డారు.
శ్రీనివాస్ గౌడ్ యూటర్న్..
ఇక 10.30 గంటలకు టికెట్లు అమ్మకం ప్రారంభించగా.. వేల సంఖ్యలో అభిమానులు రావడంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనలో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఊహించని ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. హెచ్‌సీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూర్తి నివేదిక ఇవ్వాలని అజారుద్దీన్ ఆదేశించింది. హెచ్‌సీఏ అధికారుల బృందం తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసింది. సమావేశం ముందు వరకు ఆగ్రహంగా కనిపించిన శ్రీనివాస్ గౌడ్.. అనంతరం హెచ్‌సీఏ పట్ల సానుభూతి కనబరుస్తూ కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన మాటలు అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.
నిర్లక్ష్యంగా అజారుద్దీన్..
ఇక అజారుద్దీన్ ఈ ఘటన పట్ల చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. హైదరాబాద్‌లో మ్యాచ్ జరిగేందుకు ఎంతో కృషి చేశానని, పాలక మండలి పూర్తిగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను చిన్నపిల్లాడిని కాదని, ప్రతీ ఒక్క విషయం ప్రభుత్వానికి చెప్పామని పేర్కొన్నారు. మ్యాచ్ టికెట్లు అయిపోయాయని, పూర్తి వివరాలు మంత్రిగారికి అందజేస్తామన్నారు. ప్రస్తుతానికి తనకు టికెట్ల లెక్కలు తెలియవని మీడియా ప్రశ్నలకు సమాధానాలు ధాట వేసారు. ఇక అజారుద్దీన్ తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా అజార్ అన్‌ఫిట్ అని కామెంట్ చేస్తున్నారు. వెంటనే అతన్ని హెచ్‌సీఏ అధ్యక్ష పదవిని తొలగించాలని బీసీసీఐని కోరుతున్నారు.
బ్లాక్ దందాలో అందరూ భాగస్వాములే..
ఇక తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాటలు వింటుంటే.. టికెట్ల బ్లాక్ దందాలో తెలంగాణ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని అభిమానులు ఆరోపిస్తున్నారు. అందుకే మీడియాతో కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. పాలక పక్షమే కాకుండా ప్రతి పక్షం కూడా ఈ స్కామ్‌లో పాలుపంచుకుందని విమర్శిస్తున్నారు. తెలంగాణలో చిన్న ఘటన జరిగినా ప్రభుత్వ వైఫల్యమే అంటూ రచ్చ చేసే ప్రతి పక్షం ఈ ఘటనపై స్పందించకపోవడంపై క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రూ.850 టికెట్ రూ.5 వేలు..
అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కావడంతోనే ఆ పార్టీ స్పందించడం లేదని, ఇంత పెద్ద సంఘటనపై నిలదీయాల్సిన ప్రతిపక్షం నిశబ్దంగా ఉండటం ఏంటని మండిపడుతున్నారు. బీసీసీఐలో బీజేపీ పెద్దలకు సంబంధించినవారే ఉండటంతో.. ఆ పార్టీ కూడా స్పందించడం లేదని, అందరూ కలిసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. బ్లాక్ మార్కెట్‌లో రూ.850 టికెట్ రూ.5 వేల రూపాయలకు అమ్ముతున్నారని అభిమానులు ఆరోపిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications