
కమీషనర్ ప్రత్యుత్తరంతో..
దాంతో, జాయింట్ లెటర్ ఇవ్వాలని సీపీ ప్రత్యుత్తరం పంపడంతో అసోసియేషన్‌లో వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. వాస్తవానికి గత నెల 29వ తేదీనే ప్లాన్ చేసిన ఏజీఎం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. దాంతో, ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు ఉప్పల్ ఓపెన్ స్టేడియంలో ఏజీఎం నిర్వహించాలని సెక్రటరీ విజయానంద్ నిర్ణయించారు. కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తూ 200 నుంచి 250 మెంబర్స్‌తో ఈ సమావేశం నిర్వహించేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ రాచకొండ సీపీని రిక్వెస్ట్ చేశాడు.

పర్మీషన్ ఇవ్వద్దన్న అజార్..
అయితే, తనను గానీ, అపెక్స్ కౌన్సిల్ గానీ సంప్రదించకుండానే విజయానంద్ ఏజీఎం ప్లాన్ చేశారు కాబట్టి పర్మిషన్ రిజెక్ట్ చేయాలంటూ ప్రెసిడెంట్ అజారుద్దీన్ లెటర్ రాశాడు. ఈ విషయంపై రాచకొండ సీపీ స్పందించారు. ఏజీఎంపై ప్రెసిడెంట్, సెక్రటరీ ఇద్దరూ వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారన్నారు. కాబట్టి ఇద్దరూ జాయింట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. అలాగే, ఏజీఎం నిర్వహణకు బోర్డు తీర్మానం కాపీతో పాటు మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎంత మంది హాజరవుతారనే దానిపై పూర్తి వివరాలు అందిస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

పదవి నుంచి తప్పిస్తారనే..
తనను గద్దెదించుతారన్న భయంతోనే ఏజీఎం నిర్వహణకు అజారుద్దీన్ అభ్యంతరం తెలుపుతున్నాడని హెచ్‌సీఏ వర్గాలు చెబుతున్నాయి. కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పటి నుంచి అజార్‌కు, మిగతా సభ్యులకు పడడం లేదనే విషయం తెలిసిందే. అజార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడంటూ సెక్రటరీ సహా ఇతర ఆఫీస్ బేరర్లు అతనిపై ఇప్పటికే తిరుగుబాటు ప్రకటించారు. అంబుడ్స్‌మన్ నియామకంపై ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా.. తాజాగా క్రికెట్ రీస్టార్ట్ వద్దంటున్న అజర్ వైఖరిపై అంతా గుర్రుగా ఉన్నారు.

రీస్టార్ట్‌కు అజార్ అడ్డు..
త్రీ డే లీగ్ కోసం సెక్రటరీ, ఇతర అపెక్స్ కౌన్సిల్ మెంబర్లు నడుం బిగించారు. ఇప్పటికే 200 పైచిలుకు క్రికెటర్లకు జింఖానా గ్రౌండ్‌లో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కానీ, కరోనా రిస్క్ ఉందని చెబుతూ అజార్ ఒక్కడే ఆట వద్దంటున్నాడు. దీంతో, ప్రతి విషయంలో మోకాలడ్డుతున్న అజార్‌పై వేటు వేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ ఏజీఎంలోనే అజార్‌పై సస్పెన్షన్ తీర్మానం పెట్టేందుకు పావులు కదుపుతున్నారని ఓ ప్రముఖ దినపత్రిక పేర్కొంది. దీన్ని అడ్డుకునేందుకే అజార్ ఏజీఎంకు పర్మిషన్ ఇవ్వొద్దంటూ సీపీకి లేఖ రాశాడని అసోసియేషన్ వర్గాలు భావిస్తున్నాయని తెలిపింది.


Click it and Unblock the Notifications












