బీసీసీఐని చూసి నేర్చకోండి.. పాక్ క్రికెట్ బోర్డుకు మహ్మద్ అమీర్ చురకలు!

కరాచీ: యువ క్రికెటర్లను ఎలా తీర్చిదిద్దాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి నేర్చుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆ జట్టు మాజీ పేసర్ మహ్మద్ అమీర్ చురకలంటించాడు. పాక్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తర్వాత నేర్చుకోవాలని చూస్తుంటే.. భారత్ క్రికెటర్లు మాత్రం అన్నీ నేర్చుకొని ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నారని తెలిపాడు. భారత జట్టుకు ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నాడు.

భారత్‌ను చూసి నేర్చుకోండి..
ఇక పీసీబీ ఒత్తిడితో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన మహ్మద్ అమీర్.. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ టీమ్ సెలక్షన్ ఫ్యానల్‌పై విమర్శలు గుప్పించాడు.'భారత్‌లోని యువ క్రికెటర్లను ఒక సారి చూడండి.. అలానే ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఆటగాళ్లను కూడా గమనించండి. వాళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. జూనియర్ స్థాయి, దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్‌లు ఆడటం ద్వారా వాళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అవసరమైన స్కిల్స్‌ను నేర్చుకుంటున్నారు. ఒక్కసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో అవకాశం దక్కగానే.. తమ స్కిల్స్‌ని అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.

సూర్య, కిషాన్ అరంగేట్ర..
కానీ.. పాకిస్థాన్‌లోని యువ క్రికెటర్లు మాత్రం ఇంటర్నేషనల్ టీమ్‌లోకి వచ్చిన తర్వాత అక్కడి కోచ్‌ల వద్ద ఆ స్కిల్స్ నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకసారి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా అరంగేట్రం మ్యాచ్‌లను చూడండి. వాళ్లు టీమిండియా కోచ్ సలహాలు లేకుండానే ఎలా అత్యుత్తమంగా ఆడారో అర్థమవుతోంది. కొన్నేళ్ల పాటు దేశవాళీ, ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఆడటంతోనే అది సాధ్యమైంది. 'అని అమీర్ వెల్లడించాడు.

ప్రిపేరై రావాలి..
పూర్తిగా సన్నదం కాకుండానే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావద్దని, దేశవాళీ క్రికెట్‌లో కావాల్సిన స్కిల్స్‌ను పెంపొందించిన తర్వాతే అరంగేట్రం చేయాలని ఆమీర్ సూచించాడు. 'అంతర్జాతీయ క్రికెట్‌లో నేర్చుకోవడానికి అది స్కూల్ క్రికెట్ కాదు. అది చాలా కఠినమైన వాతావరణం. అన్ని విధాలుగా సిద్దమైన ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాలి. క్రికెట్ గురించి నేర్చుకోవాలంటే అకడమీ లేదా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనే నేర్చుకోవాలి. ఆటను మెరుగుపరుచుకోవాలి. ఎలాంటి సన్నదం లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి దేశం పరువు తీయవద్దు. ఎలాంటి నైపుణ్యాలు లేకున్నా పాక్ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి వస్తుంటారు. ఇకనైనా ఆ పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నా.'అని ఆమీర్ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ సీనియర్ టీమ్ సెలక్షన్‌పై గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువ క్రికెటర్లను పట్టించుకోకుండా సీనియర్ ఆటగాళ్లకు వరుస చాన్స్‌లివ్వడం, సిఫార్సులతో సెలెక్షన్స్ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications