Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్ పిరికిపంద అయితే ఇలానే ఉంటది.. అయినా ఫైనల్ చేరడమే గొప్ప: మహమ్మద్ ఆమీర్

Mohammad Amir Says Babar Azam Not Trusting Mohammad Nawaz Cost Pakistan in Big Final against England

కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై ఆ జట్టు మాజీ పేసర్ మహమ్మద్ ఆమీర్ విమర్శలు గుప్పించాడు. బాబర్ పిరికిపంద చర్యల వల్లనే పాకిస్థాన్ ఫైనల్లో విజయం సాధించలేకపోయిందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దాంతో టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని ఆ జట్టు చేజార్చుకుంది.

ఈ ఫలితంపై స్పందించిన మహమ్మద్ ఆమీర్.. బాబర్ ఆజామ్ కెప్టెన్సీని తప్పుబట్టాడు. మైదానంలో కెప్టెన్ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని, అలా కాకుండా భయపడుతూ జట్టును నడిపిస్తే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో మహమ్మద్ నవాజ్‌కు బౌలింగ్ ఇవ్వకపోవడాన్ని ఆమీర్ తప్పుబట్టాడు.

నవాజ్‌కు బౌలింగ్ ఇవ్వరా?

నవాజ్‌కు బౌలింగ్ ఇవ్వరా?

'ఈ టోర్నీలో పాకిస్థాన్ బౌలింగే గొప్పదని, ఎవరూ కూడా పాక్ బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగలేరని అంగీకరిస్తా. కానీ మహమ్మద్ నవాజ్‌కు ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదో నాకైతే అర్థం కావడంలేదు. భారత్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో బాబర్ మాట్లాడుతూ.. మహమ్మద్ నవాజ్ మన మ్యాచ్ విన్నరని చెప్పాడు. కానీ ఆ తర్వాత అతన్ని కేవలం బ్యాటర్‌గా ట్రీట్ చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. ఇది అతనిపై బాబర్‌కు నమ్మకం లేదనే విషయాన్ని తెలియజేస్తుంది.

కెప్టెన్ ధైర్యంగా ఉండాలి..

కెప్టెన్ ధైర్యంగా ఉండాలి..

కెప్టెన్‌గా ఏం చెబితే అది చేయాలి. పీఎస్‌ఎల్‌లో నవాజ్ తొలి ఓవర్ వేసేవాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించిన సత్తా అతనిది. ఫైనల్లో కూడా అతను కీలక పాత్ర పోషించేవాడు. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో హరీ బ్రూక్ తడబడ్డాడు. ఆ టైమ్‌లో నవాజ్‌కు బౌలింగ్ ఇచ్చి ఉంటే మరింత ఇబ్బంది పెట్టేవాడు. కెప్టెన్ ధైర్యంగా ఉండాలి. నిర్ణయాలు దూకుడు తీసుకోవాలి.'అని ఆమీర్ చెప్పుకొచ్చాడు.

ఫైనల్ చేరడమే గొప్ప..

ఫైనల్ చేరడమే గొప్ప..

ఇక పాకిస్థాన్ ఫైనల్ చేరడమే గొప్పని ఆమీర్ అభిప్రాయపడ్డాడు. 'మనం ఫైనల్ ఆడడమే చాలా పెద్ద విషయం. ఫైనల్ ఆడేందుకు కావాల్సిన అర్హత మనకు ఉందా? మనం ఫైనల్‌కి ఎలా వచ్చామో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏదో దేవుడు కరుణించి, అదృష్టం ఈడ్చి పెట్టి తన్నడంతో ఫైనల్‌కి వచ్చేశాం. పాకిస్థాన్ బ్యాటింగ్ చూసినప్పుడు ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అందరికీ అర్థమైంది. గ్రూప్ మ్యాచులు ముగిసిన తర్వాత సిడ్నీ నుంచి టీమ్ వచ్చినప్పుడే ఇలా జరుగుతుందని ఊహించా... ఏదో లక్కీగా సెమీ ఫైనల్ గెలిచారు. అక్కడ ముందు బ్యాటింగ్ చేసినా ఇంటి బాట పట్టేవారు.

కామెన్‌సెన్స్ ఉండాలి..

కామెన్‌సెన్స్ ఉండాలి..

మెల్‌బోర్న్‌లో పిచ్‌పై పాక్ బ్యాటర్లు ఇబ్బందిపడతారని నాకు తెలుసు. మహ్మద్ హారీస్ మంచి ఇంటెంట్ చూపించాడు. అయితే ఇంటెంట్‌తో పాటు కాస్త కామన్ సెన్స్ కూడా ఉండాలి. అదిల్ రషీద్ బౌలింగ్‌లో మొదటి బాల్ ఫేస్ చేస్తున్నప్పుడే షాట్ ఆడాల్సిన అవసరం ఏముంది. పిచ్ గురించి తెలీదు, బౌలర్ల గురించి తెలీదు, వారి బౌలింగ్ స్టైల్ గురించి తెలీదు. తెలిసిందల్లా వచ్చిన బంతిని వచ్చినట్టు గాల్లోకి లేపడమే. ఇలాంటి పిచ్‌లపై ఆడాలంటే గేమ్‌ను రీడ్ చేయడం తెలియాలి. అందుకే బెన్ స్టోక్స్ మ్యాచ్ విన్నర్ అయ్యాడు. 'అని ఆమీర్ విమర్శించాడు.

Story first published: Monday, November 14, 2022, 14:20 [IST]
Other articles published on Nov 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+