ఆ వ్యూహంతోనే కోహ్లీ, రోహిత్, ధావన్‌ను ఔట్ చేశా.. అందుకే ఆ మ్యాచ్ నాకు స్పెషల్: మహ్మద్ ఆమిర్

కరాచీ: 2017 చాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్ తనకెంతో ప్రత్యేకమని పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ అన్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఆమిర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించడం గోప్ప అనుభూతిగా వర్ణించాడు. ఈ టైటిల్ ఫైట్‌లో దారుణంగా విఫలమైన భారత్ చాంపియన్స్ ట్రోఫీని తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ముగ్గురికి ఔట్ చేయడానికి తాను ఓ స్ట్రాటజీ ఫాలో అయ్యానని, అదే తనకు వారి వికెట్లను దక్కేలా చేసిందని ఆమిర్ గుర్తు చేసుకున్నాడు.

రోహిత్‌ను ఇన్ స్వింగర్‌తో ..
‘ఫస్ట్ ఓవర్ నేను వేసాను. బంతి అందుకోగానే ఓపెనర్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీయాలనుకున్నాను. ఇన్‌స్వింగ్ డెలివరీలకు రోహిత్ ఇబ్బంది పడతాడనే విషయం నాకు ముందే తెలుసు. అదే వ్యూహాన్ని అతనిపై ఉపయోగించాను. కావాలనే తొలి రెండు బంతులను వికెట్లకు దూరంగా వేసి మూడో బంతిని కచ్చితమైన ఇన్‌స్వింగర్‌గా సంధించాను. దాంతో ఆశ్చర్యపోయిన రోహిత్ శర్మ.. నా ట్రాప్‌లో చిక్కుకున్నాడు. ఎల్బీడబ్ల్యూగా పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు.

విరాట్ వికెట్ లక్కీగా..
అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీని కూడా ఎలాగైనా అవుట్ చేయాలనుకున్నాను. కోహ్లీకి తొలుత ఇన్‌స్వింగర్ వేసాను. కానీ అతను దాన్ని సమర్ధవంతంగా ఆడాడు. రెండోబంతిని కూడా అలానే సంధించాను. అతను ఆ బంతిని ఆడితే స్లిప్‌లో దొరికిపోతాడని భావించా. కానీ విరాట్ దానిని ఆన్‌సైడ్ ఆడాడు. అతని శరీరం అప్పటికే ఆన్‌సైడ్‌కు తిరిగి ఉంది. దాంతో బ్యాట్‌కు తగిలి అమాంతం గాల్లోకి లేచింది. షాదాబ్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అయితే అంతకుముందే స్లిప్‌లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను అజార్ అలీ చేజార్చడంతో మా బ్యాట్స్‌మెన్ ఫకార్ జమాన్‌లానే కోహ్లీ కూడా చెలరేగుతాడనుకున్నా. కానీ అదష్టవశాత్తూ ఆ వెంటనే క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు.

ఆమిర్ సూపర్ స్పెల్..
ఇక ధావన్ కూడా నా బౌలింగ్‌లోనే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ అందుకే నాకు చాలా స్పెషల్'' అంటూ ఆమిర్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో 6 ఓవర్లు వేసిన ఆమీర్.. 16 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లను తీసి భారత్ పతనాన్ని శాసించాడు. దాంతో భారత్‌పై విజయంతో పాటు చాంఫియన్స్ ట్రోఫీని పాక్ కైవసం చేసుకుంది. అయితే ఈ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో పాక్.. భారత్ చేతిలో చిత్తుగా ఓడటం గమనార్హం. అయితే పాక్ ఇన్నింగ్స్‌లో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చేసిన తప్పిదం భారత్ కొంపముంచింది.
అతని బౌలింగ్ ఫకార్ జమాన్ ఆదిలోనే ఔటవ్వగా.. అది నోబాల్ కావడంతో అతను సెంచరీతో చెలరేగాడు. ఇది భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఇదిలా ఉంటే పాక్ క్రికెట్ బోర్డు పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేకనే ఆటకు గుడ్‌బై చెబుతున్నానని 28 ఏళ్ల ఆమిర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications