
క్రికెట్‌కి గుడ్ బై
డిసెంబరు 18 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభంకాబోతున్న మూడు టీ20ల సిరీస్‌కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మహ్మద్ అమీర్‌ను ఎంపిక చేయలేదు. ఇక న్యూజిలాండ్‌తో మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్ కోసం 35 మందితో కూడిన బృందంను ఎంపిక చేసిన పాకిస్థాన్.. అందులో అమీర్‌కి చోటివ్వలేదు. దాంతో తీవ్ర మనస్థాపం చెందిన అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. నేషనల్ టీమ్‌కు ఎంపిక చేయకపోవడంతో అమీర్.. శ్రీలంక వెళ్లి లంక ప్రిమియర్ లీగ్‌లో ఆడాడు. న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం తనను ఎంపిక చేయకపోవడం తనకో మేలుకొలుపులాంటిదని ఆమిర్ అన్నాడు.

మానసికంగా హింసిస్తున్నారు
పాకిస్థాన్ జర్నలిస్ట్ షోయబ్ జాట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహ్మద్ అమీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 'నేను క్రికెట్ నుంచి దూరంగా వెళ్లడం లేదు. అయితే ఈ టీమ్ మేనేజ్‌మెంట్ కింద మాత్రం నేను క్రికెట్ ఆడతానని అస్సలు అనుకోవడం లేదు. ఈసారి నేను క్రికెట్‌ను వదిలి పెట్టాల్సిందే. నన్ను మానసికంగా హింసిస్తున్నారు. 35 మంది సభ్యుల్లో నేను ఎంపిక కాకపోవడం నిజంగా నాకో మేలుకొలుపులాంటిదే' అని అమీర్ అన్నాడు. పాక్ తరఫున 36 టెస్టులాడిన అమీర్ 119 వికెట్లు పడగొట్టాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున ఈ ఏడాది ఆగస్టులో చివరగా టీ20 మ్యాచ్ ఆడాడు.

అధికారిక ప్రకటనని విడుదల చేస్తా
'ఈ వేధింపులు భరించడం నా వల్ల కాదు. 2010 నుంచి 2015 మధ్య చాలా వేదనకు గురయ్యాను. ఆ సమయంలో నేను చేసిన తప్పు వల్ల గేమ్‌కు దూరమయ్యా. ప్రతిసారి నాకోసం పీసీబీ భారీగా ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం చేస్తోంది. ఇక నాకు పాకిస్థాన్ తరఫున ఆడాలని లేదు. రెండు రోజుల్లో పాకిస్థాన్‌కి వెళ్లి.. అధికారిక ప్రకటనని విడుదల చేస్తా' అని ఆమిర్ చెప్పాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంతో ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న తర్వాత టీమ్‌లోకి వచ్చినా.. చాలా మంది ప్లేయర్స్ తనతో కలిసి ఆడటానికి నిరాకరించారని తెలిపాడు. ఆ సమయంలో షాహిద్ అఫ్రిది, అప్పటి పీసీబీ చీఫ్ నజమ్ సేఠీ తనకు అండగా నిలిచారని.. వాళ్లిద్దరికీ తానెప్పుడూ రుణపడి ఉంటానని చెప్పాడు.

టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించడంతో
2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాదిలోనే పాక్ అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగాడు. ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అయితే 2010లో ఇంగ్లాండ్ పర్యటనలో స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. దాంతో అమీర్ కెరీర్ ముగిసిపోయిందని అంతా ఊహించారు. కానీ 2015-2016లో మళ్లీ పాక్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అమీర్.. అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగాడు. గత ఏడాది అనూహ్యంగా టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ పెద్దలకి కోపం తెప్పించాడు. అప్పటి నుంచి పీసీబీ నుంచి కూడా అతనికి మొండిచేయి ఎదురవుతూ వచ్చింది.
డే/నైట్ టెస్ట్: ముగిసిన తొలి రోజు ఆట.. ఆదుకున్న కోహ్లీ, పుజారా.. భారత్ 233/6!


Click it and Unblock the Notifications












