
క్లారిటీ లేదు..
'నా పిల్లలు ఇంగ్లండ్‌లోనే పెరుగుతూ.. చదువుకుంటున్నారు. కాబట్టి సిటిజన్‌షిప్‌తో వాళ్లకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నేను కూడా కనీసం 6-7 ఏళ్లు క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నా. ఈ మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ ఆడటానికి ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తున్నా. అయితే బ్రిటీష్ సిటిజన్‌షిప్ ఎప్పుడు వస్తుందో..? అది వచ్చిన తర్వాత ఎలాంటి అవకాశాలు దక్కుతాయో అనే విషయంపై నాకు ఎలాంటి అవగాహన లేదు . ' అని అమీర్ వెల్లడించాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహ్మద్ కూడా ఇలానే బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని.. ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ తరఫున గతంలో మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో ఫాస్ట్ బౌలర్లకు.. మరీ ముఖ్యంగా.. ఎడమచేతి వాటం పేసర్లకు మంచి డిమాండ్ ఉంది.

అతన్ని తిట్టరేం..
ఇక కొంతమంది పనిగట్టుకొని తనపై విమర్శలు గుప్పిస్తున్నారని అమీర్ అసహనం వ్యక్తం చేశాడు. 'ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్స్ కోసమే నేను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పానని, డబ్బులు సంపాదించాలనే దుర్బుద్దితోనే ఇలా చేశానని విమర్శిస్తున్నారు. నేను ఏం చేసినా దాన్ని నెగటీవ్‌గా మార్చి విషం చిమ్ముతున్నారు. అయితే వాళ్లందరిని నేనొక్కటే అడుగుతున్నా. ఈ ప్రపంచంలో నా ఒక్కడి కోసమే లీగ్‌లు నిర్వహిస్తున్నారా? ఇతర పాకిస్థాన్ ఆటగాళ్లు ఎవరూ లీగ్స్ ఆడటం లేదా? ఇటీవల హైదర్ అలీ కరీబీయన్ ప్రీమియర్ లీగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతన్ని ఎందుకు నాలాగా విమర్శించరు?. ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్స్ అవకాశం వస్తే ఎవరైనా అడాల్సిందే.'అని అమీర్ చెప్పుకొచ్చాడు.

బీసీసీఐని చూసి నేర్చకోండి
యువ క్రికెటర్లను ఎలా తీర్చిదిద్దాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి నేర్చుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మహ్మద్ అమీర్ చురకలంటించాడు. పాక్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తర్వాత నేర్చుకోవాలని చూస్తుంటే.. భారత్ క్రికెటర్లు మాత్రం అన్నీ నేర్చుకొని ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నారని తెలిపాడు. భారత జట్టుకు ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నాడు.

చాంపియన్స్ ట్రోఫీ విజయంలో...
2009లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాది వ్యవధిలోనే స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతూ అతను ఫిక్సింగ్‌కి పాల్పడటంతో అక్కడే జైల్లో కూడా కొన్ని రోజులు ఉంచారు. అయితే.. నిషేధం తర్వాత మళ్లీ పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అమీర్.. అంచనాలకి మించి రాణించాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ని పాక్ ఓడించి టోర్నీ విజేతగా నిలవడంలో అమీర్ క్రియాశీలక పాత్ర పోషించాడు. కానీ.. గత ఏడాది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తనని మెంటల్ టార్చర్‌కి గురిచేస్తోందని వాపోయిన అమీర్.. ఎవరూ ఊహించని రీతిలో 28 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. కెరీర్‌లో అమీర్ 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేసిన తర్వాత యూకేకి వెళ్లిపోయిన అమీర్.. అక్కడే తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు.


Click it and Unblock the Notifications












