Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PSL 2021: మైదానంలో మహమ్మద్ అమీర్ X ఇఫ్తికర్ అహ్మద్ డిష్యుం డిష్యుం! (వీడియో)

Mohammad Amir and Iftikhar Ahmed get involved in a heated altercation during PSL 2021 match

అబుదాబి: పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2021 సీజన్ సెకండాఫ్ అబుదాబి వేదికగా కొనసాగుతోంది. సోమవారం కరాచీ కింగ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ పేసర్ మహమ్మద్ అమీర్, ఇస్లామాబాద్ బ్యాట్స్‌మన్ ఇఫ్తికర్ అహ్మద్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపై ఒకరు నోరుపారేసుకున్నారు. నువ్వెంతా? అంటే నువ్వెంతా అని గలాటకు దిగారు. ఒకరిపై మరొకరు దూసుకెళ్లారు. చివరకు అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

అసలేం జరిగిందంటే..?

ఇస్లామాబాద్ యునైటెడ్ ఇన్నింగ్స్‌ సందర్భంగా మహమ్మద్ అమీర్ వేసిన 15వ ఓవర్‌లో ఈ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని ఇఫ్తికర్ బౌండరీ బాదగా.. ఆమీర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అప్పటికే అతను దారళంగా పరుగులిచ్చుకున్నాడు. దాంతో ఇఫ్తికర్‌ను ఉద్దేశించి ఏవో వ్యాఖ్యలు చేశాడు. దానికి ఇఫ్తికర్ కూడా బదులు ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. కరాచీ కింగ్స్ కెప్టెన్ ఇమాద్ వసీం కూడా తన పేసర్‌కు అండగా నిలవడంతో వివాదం మరింత పెద్దదయింది. చివరకు అంపైర్లు జోక్యం చేసుకోని ఆటగాళ్లు వారించడంతో గొడవ సద్దుమణిగింది.

చెలరేగిన కొలిన్ మున్రో..

చెలరేగిన కొలిన్ మున్రో..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. బాబర్ ఆజామ్(81) తన ఫామ్‌ను కొనసాగించగా.. నజిబుల్లా జడ్రాన్(71 నాటౌట్)అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇస్తామాబాద్ బౌలర్లలో అకిఫ్ జావెద్, హసన్ అలీ, మహమ్మద్ వసీం, అలీఖాన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఇస్తామాబాద్.. కొలిన్ మున్రో(88 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(71 నాటౌట్) అజేయ అర్థశతకాలతో చెలరేగడంతో 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. మహమ్మద్ అమీర్ దారళంగా పరుగులిచ్చాడు.

పాక్ బోర్డుపై ఆగ్రహంతో..

పాక్ బోర్డుపై ఆగ్రహంతో..

2009లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మహమ్మద్ అమీర్.. ఏడాది వ్యవధిలోనే స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతూ అతను ఫిక్సింగ్‌కి పాల్పడటంతో అక్కడే జైల్లో కూడా కొన్ని రోజులు ఉంచారు. అయితే.. నిషేధం తర్వాత మళ్లీ పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అమీర్.. అంచనాలకు మించి రాణించాడు.

2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ని పాక్ ఓడించి టోర్నీ విజేతగా నిలవడంలో అమీర్ క్రియాశీలక పాత్ర పోషించాడు. కానీ.. గత ఏడాది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తనని మెంటల్ టార్చర్‌కి గురిచేస్తోందని వాపోయిన అమీర్.. ఎవరూ ఊహించని రీతిలో 28 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. కెరీర్‌లో అమీర్ 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేసిన తర్వాత యూకేకి వెళ్లిపోయిన అమీర్.. అక్కడే తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు.

Story first published: Tuesday, June 15, 2021, 16:23 [IST]
Other articles published on Jun 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+