Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ వికెట్ టేకర్‌‌ను ఎందుకు ఆడించడం లేదు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడాన్ని మాజీ క్రికెటర్ మోయిన్ అలీ తప్పుబట్టాడు. వరల్డ్ బెస్ట్ స్పిన్నర్లలో ఒకడైన కుల్దీప్ యాదవ్‌ను ఆడించకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. వికెట్ టేకర్ అయిన 31 ఏళ్ల కుల్దీప్ యాదవ్‌.. భాగస్వామ్యాలను విడదీయడంలో దిట్ట అని చెప్పుకొచ్చాడు.

ఈ మూడు వన్డేల సిరీస్‌లో కుల్దీప్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగింది. అక్షర్ పటేల్ ఒక్కడే స్పిన్నర్‌గా వ్యవహరించాడు. అయితే ఈ నిర్ణయం టీమిండియాకు నష్టం చేసింది. భారత పేసర్లు చేతులెత్తేయడంతో ఇంగ్లండ్ 387 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది.

Moeen Ali slams Team India over Kuldeep Yadav s omission in India vs England ODI Series

అతను వరల్డ్ బెస్ట్ స్పిన్నర్..

తాజాగా ఈ విషయంపై మాట్లాడిన మోయిన్ అలీ.. టీమిండియా మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టాడు. బుమ్రా లేకపోవడం కూడా భారత్ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. 'కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు ఆడించడం లేదో నాకు అర్థం కావడం లేదు. అతను ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు.

IND vs ENG: బుమ్రా లేకుంటే.. అంతా ఉత్తదే!

IND vs ENG: బుమ్రా లేకుంటే.. అంతా ఉత్తదే!

భారత జట్టుకు అతను ఆదిల్ రషీద్ లాంటివాడు. భాగస్వామ్యాలను విడదీయడంలో దిట్ట. అతని బౌలింగ్‌ను అంచనా వేయడం బ్యాటర్లకు అంత సులువు కాదు. అతన్ని తుది జట్టులో తప్పకుండా ఆడించాలి. బ్యాటింగ్ డెప్త్ కోసం భారత జట్టు అతన్ని పక్కనపెడుతున్నట్లు అర్థమవుతోంది.

బుమ్రా లేకుంటే ఉత్తదే..

వారి బౌలర్లలో చాలా మంది బ్యాటింగ్ చేయలేకపోవడం టీమిండియాకు సమస్యగా మారింది. బుమ్రా లేకుండా భారత బౌలింగ్ సాధారణంగా కనిపిస్తోంది. పిచ్ అనుకూలంగా ఉంటేనే వారు రాణించగలరు. కానీ వికెట్ ఫ్లాట్‌గా ఉంటే భారత బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

అతన్ని ఒక్కసారి ఔట్ చేయలేకపోయారు.. ఇదేం బౌలింగ్: ఇర్ఫాన్ పఠాన్

అతన్ని ఒక్కసారి ఔట్ చేయలేకపోయారు.. ఇదేం బౌలింగ్: ఇర్ఫాన్ పఠాన్

ఆఖరి వన్డేలో బుమ్రా లేకపోవడం భారత జట్టుకు పెద్ద లోటు. అతను ఆరంభంలోనే వికెట్లు తీయడంలో.. పరుగులు కట్టడి చేయడంలో దిట్ట. అతను ఇతర బౌలర్లకు కూడా సహాయపడుతాడు. ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్‌లను కలిపితే బుమ్రా ఒక్కడు.'అని మోయిన్ అలీ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, July 21, 2026, 17:02 [IST]
Other articles published on Jul 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+