Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇతర కెప్టెన్లకు ధోనీకి ఉన్న తేడా అదే: మొయిన్ అలీ

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రశంసల జల్లు కురిపించాడు. యువ ఆటగాళ్లతో పాటు ఫామ్‌లో లేని ఆటగాళ్లను సరిదిద్దడంలో ధోనీకి సాటిలేరని కొనియాడాడు. ఒకటీ రెండు మ్యాచుల్లో విఫలమైనప్పటికీ.. ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి వారి నుంచి ఫలితం రాబట్టడంలో ధోనీ మాస్టర్ అని తెలిపాడు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. మంగళవారం చెపాక్ మైదానం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్నక్వాలిఫయర్-1లో తలపడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మాట్లాడిన మొయిన్ అలీ.. ధోనీ గొప్పతనాన్ని కొనియాడాడు. ఈ సీజన్‌లోనూ యువ బౌలర్లతోనే అద్భుతాలు సృష్టిస్తూ జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడని చెప్పాడు.

 Moeen Ali

'ప్రతీ జట్టుకు కెప్టెన్ చాలా కీలకం. అతను తీసుకునే నిర్ణయాలపైనే జట్టు ఫలితం ఆధారపడి ఉంటుంది. యువ క్రికెటర్ల నుంచి మంచి ఫలితాలను రాబట్టగలిగితే.. అంతకుమించిన గొప్ప సారథ్యం మరొకటి ఉండదు. అత్యుత్తమ జట్టులో ఎప్పుడూ స్థానం కోసం తీవ్ర పోటీ ఉండటం సహజం. అవకాశం వచ్చినప్పుడు తమను నిరూపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు.

ఇలాంటి అవకాశాలు తరచూ రావు. వచ్చినప్పుడు వదిలిపెట్టకూడదు. ప్రతీ ఆటగాడిలోనూ ఇదే ఆలోచన వస్తుంది. ఇలా రావడానికి ప్రధాన కారణం కెప్టెన్‌. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతూ అవసరమైన చర్యలను జట్టు సారథి తీసుకుంటాడు. ఇదే ఇతర కెప్టెన్లకు ఎంఎస్ ధోనీకి ఉన్న ప్రధాన వ్యత్యాసం.

ఆరంభంలో ఓ రెండు మ్యాచుల్లో సరిగా ఆడకపోతే ఇతర జట్లలా ఆటగాళ్లను పక్కన పెట్టేయకుండా అవకాశాలూ ఇస్తూ ఉంటాడు. ప్లేయర్‌లోని సత్తాను మాత్రమే ధోనీ చూస్తాడు. అప్పుడే జట్టుకు అనుగుణంగా వారికి అవకాశాలు ఇస్తారు. ఇతర జట్లు అలా చేయలేవు' అని మొయిన్‌ అలీ చెప్పుకొచ్చాడు.

బలబలాల పరంగా చెన్నై‌ కంటే గుజరాత్ టైటాన్స్ మెరుగ్గా ఉంది. ముఖా ముఖి పోరులోనూ గుజారత్‌దే ఆధిక్యం. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా మూడింటికి మూడు గుజరాత్ టైటాన్సే గెలిచింది. పైగా ఆ జట్టు వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఆదివారం ఆర్‌సీబీని 6 వికెట్లతో చిత్తు చేసి ఇంటికి పంపించింది.

అయితే సొంతమైదానమైన చెన్నై వేదికగా క్వాలిఫయర్-1 జరగడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ధోనీ సారథ్యం, బలమైన టాపార్డర్ అదనపు బలాలు.

Story first published: Monday, May 22, 2023, 22:34 [IST]
Other articles published on May 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+