అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్(ఎమ్‌ఎల్‌సీ)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్ వెల్.. క్లీన్ బౌల్డ్ అయిన తర్వాత రివ్యూ తీసుకునే ప్రయత్నం చేశాడు. క్లీన్ బౌల్డ్ అయ్యావని ప్రత్యర్థి ఆటగాడు చెప్పడంతో వెనక్కి చూసుకొని నవ్వుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టుకు ఆడుతున్న మైఖేల్ బ్రేస్‌వెల్.. సాన్‌ఫ్రాన్సిస్కోతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రొమారియా షెపర్డ్ వేసిన 17వ ఓవర్ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే తాను ఎల్బీడబ్ల్యూ అనుకొని రివ్యూ కోసం సిగ్నల్ ఇచ్చాడు. కానీ ప్రత్యర్థి ఆటగాడు.. క్లీన్ బౌల్డ్ అయ్యావని చెప్పడంతో వెనక్కి చూసుకొని నవ్వుకున్నాడు. బ్రెస్ వెల్ బ్రెయిన్ ఫేడ్ మూమెంట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. 'నువ్వు క్లీన్ బౌల్డ్ అయ్యావు రా సామీ.. రివ్యూ తీసుకుంటావ్'అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ న్యూ యార్క్ టీమ్..47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 246 పరుగులు చేసింది. కెప్టెన్ మాథ్యూ షార్ట్(91), జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(64) రాణించారు. అనంతరం ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 20 ఓవర్లలో 199 పరుగులే చేసి ఓటమిపాలైంది. మోనాక్ పటేల్(60), క్వింటన్ డికాక్(70) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది.
Ever seen a batter (accidentally) try to review after getting bowled?
— 7Cricket (@7Cricket) June 24, 2025
Poor Michael Bracewell got a little confused 😂 pic.twitter.com/NObOrv8UIo