For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లేడీ ఫ్యాన్‌ను గాయపర్చిన పోలార్డ్!(వీడియో)

వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్.. ఓ అమ్మాయిని గాయపర్చాడు. అనంతరం ఆమెకు క్షమాపణలు చెప్పి ఆటో గ్రాఫ్ చేసిన తన క్యాప్‌ను బహుమతిగా అందించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా సోమవారం ఉదయం లాస్ ఏంజెల్స్‌ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

MLC 2024 Kieron Pollard apologizes to a fan after a ball hits her during MINY vs LAKR match

12 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. పోలార్డ్ కొట్టిన మూడు సిక్సర్లలో ఓ సిక్సర్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ముంబై ఇండియన్స్ లేడీ ఫ్యాన్‌ను బలంగా తాకింది. లాస్‌ ఏంజిల్స్‌ నైట్‌ రైడర్స్‌ బౌలర్‌ స్పెన్సర్ జాన్సన్ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో పోలార్డ్ వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు.

అయితే ఓవర్ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన సిక్సర్ ఆ అమ్మాయి భుజానికి తాకింది. మ్యాచ్ ముగిసిన వెంటనే పోలార్డ్ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా ఆటోగ్రాఫ్‌ చేసిన తన క్యాప్‌ను గిఫ్ట్‌గా అందించాడు. పోలార్డ్ దగ్గరకు రావడంతో ఆ అమ్మాయి ఆ నొప్పినే మరిచిపోయింది. పోలార్డ్ క్షమాపణలకు పర్లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక పోలార్డ్ సదరు మహిళా భర్తకు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం వీడియోలో కనిపించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజెల్స్ 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీ రస్సెల్ (21 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 35), జేసన్ రాయ్ ( 23 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ (3/22) మూడు వికెట్లు తీయగా.. బౌల్ట్ (2/38), కెంజిగే (2/22) చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 17 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నిఅందుకుంది. నికోలస్ పూరన్ ( 28 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35), పొలార్డ్ (12 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 నాటౌట్), డెవాల్డ్ బ్రెవిస్ (19 బంతుల్లో, 5 ఫోర్లతో 27) ధాటిగా ఆడారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు తీశాడు.

Story first published: Monday, July 22, 2024, 20:29 [IST]
Other articles published on Jul 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+