MLC 2023: హవ్వా.. 50 పరుగులకే ఆలౌట్!
న్యూయార్క్: మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ) 2023 సీజన్‌లో సంచలన ఫలితం నమోదైంది. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ న్యూయార్క్ టీమ్ భారీ విజయం నమోదు చేసింది. కేకేఆర్‌కు చెందిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్‌ను 50 పరుగులకే ఆలౌట్ చేసి 105 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆండ్రీ రస్సెల్, మార్టిన్ గప్టిల్, సునీల్ నరైన్, రిలీ రోసౌ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నా.. లాస్ ఏంజిల్స్ టీమ్స్ కనీస పోటీ ఇవ్వలేక 5 పరుగులకు కుప్పకూలింది. టీ20 లీగ్ చరిత్రలోనే కేకేఆర్ ఫ్రాంచైజీకి ఇది ఘోర పరాజయం.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. టీమ్ డేవిడ్(21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. నికోలస్ పూరన్(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 38) పర్వాలేదనిపించాడు. లాస్ ఏంజిల్స్ బౌలర్లలో అలిఖాన్, ఆడమ్ జంపా, కోర్న్ డ్రై రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ 13.5 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. ఉన్ముక్త్ చంద్(26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్టిన్ గప్టిల్(0), నితీశ్ కుమార్(0), కార్న్ డై(0), లాకీ ఫెర్గూసన్(0)లతో మొత్తం నలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. డేంజరస్ ఆండ్రీ రస్సెల్(2), సునీల్ నరైన్(2), రిలీ రోసౌ(2) రెండేసి పరుగులతో దారుణంగా విఫలమయ్యారు.
ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, కగిసో రబడా, ఎహ్‌సన్ ఆదిల్, కీరన్ పోలార్డ్, నస్తూష్ కెనిజ్ తలో రెండు వికెట్లతో ఎల్‌ఏకేఆర్ పతనాన్ని శాసించారు. 50 పరుగులకు ఆలౌటవ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్ ఫ్రాంచైజీకి ఉన్న ప్రతిష్టను దిగజార్చుతున్నారని మండిపడుతున్నారు.
మరోవైపు నిలకడగా రాణిస్తున్న టీమ్ డేవిడ్‌పై ముంబై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications