Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్‌సీబీ కెప్టెన్ కళ్లు చెదిరే క్యాచ్! (వీడియో)

డల్లాస్: అగ్రరాజ్యంలో జరుగుతున్న మినీ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. సూపర్ డైవ్‌తో బంతిని అందుకొని ఔరా అనిపించాడు. మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ)‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న ఫాఫ్ డుప్లెసిస్.. మంగళవారం ఏంఐ న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఫీల్డింగ్‌తో మైమరిపించాడు.

డుప్లెసిస్ సెన్సేషనల్ క్యాచ్ ఎంఐ న్యూయార్క్ పతనాన్ని శాసించింది. మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డానియల్ సామ్స్ వేసిన చివరి ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

MLC 2023: Faf du Plessis Takes Stunning Diving Catch To Send Back Tim David

చివరి 6 బంతుల్లో ఎంఐ న్యూయార్క్ విజయానికి 21 పరుగులు కాగా.. క్రీజులో సూపర్ ఫామ్‌లో ఉన్న టీమ్ డేవిడ్ ఉన్నాడు. దాంతో ఆ జట్టు విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ డానియల్ సామ్స్ వేసిన తొలి బంతిని టీమ్ డేవిడ్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి గాల్లోకి లేవగా.. బౌండరీ లైన్ నుంచి ముందుకు పరుగెత్తుకొచ్చిన ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. దాంతో టీమ్ డేవిడ్(24) నిరాశగా పెవిలియన్ చేరగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్ విజయాన్నందుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే(55 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 74) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. మిచెల్ సాంట్నర్(27) మెరుపులు మెరిపించాడు.

ఎంఐ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, కగిసో రబడా రెండేసి వికెట్లు తీయగా.. కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఎంఐ న్యూయార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేసి ఓటమిపాలైంది. ఓపెనర్ షయన్ జహంగీర్(41), టీమ్ డేవిడ్(24) మినహా అంతా విఫలమయ్యారు.

టెక్సాస్ బౌలర్లలో డానియల్స్ సామ్స్, మహమ్మద్ మోహ్‌సిన్ రెండేసి వికెట్లు తీయగా.. రస్టీ థేరన్, జియా ఉల్ హక్, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, July 18, 2023, 11:17 [IST]
Other articles published on Jul 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+