
రెండు సార్లు ఫైనల్‌కు..
భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అటకు వీడ్కోలు పలకబోతున్నట్లు తెలిపింది. త్వరలో జరగబోయే వన్డే ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. 2005, 2017 వన్డే ప్రపంచకప్‌ల్లో జట్టును ఒంటి చేత్తో ఫైనల్‌కు చేర్చింది. అదృష్టం కలిసిరాక రెండు సార్లు టైటిల్ ముద్దాడలేకపోయింది. భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఆధరణ పెంచడంలో మిథాలీ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న మిథాలీ రాజ్.. వన్డే ప్రపంచకప్ కోసం సిద్దమవుతోంది.

టీమిండియా మరింత బలంగా..
న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేల్లో టీమిండియా విజయానంతరం మాట్లాడిన మిథాలీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది.
అప్‌కమింగ్ వన్డే ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని తెలిపిన మిథాలీ.. టాలెంట్ కలిగిన ఆటగాళ్లతో జట్టు మరింత బలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.‘నేను ఈ టోర్నమెంట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాను. ఆ తర్వాత కొత్త టాలెంట్ కలిగిన ఆటగాళ్ల రాకతో జట్టు మరింత బలంగా తయారవుతుంది.'అని చెప్పుకొచ్చింది.

లేడీ సచిన్..
మిథాలీ రాజ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 222 వన్డేలు ఆడి 51.8 సగటుతో 7,516 పరుగులు సాధించింది. ఇందులో 7 సెంచరీలు, 61 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో ఆమె అత్యధిక స్కోరు 125 నాటౌట్. టెస్టుల్లో 12 మ్యాచ్‌లు ఆడి 43.7 సగటుతో 699 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో ఆమె అత్యధిక స్కోరు 214 పరుగులు. 89 టీ20 మ్యాచులాడిన ఆమె 37.52 సగటుతో 2,364 పరుగులు సాధించింది. ఇందులో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

చెలరేగిన స్మృతి, హర్మన్, మిథాలీ..
చివరిదైన ఐదో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా మహిళలు.. కివీస్ మహిళల జట్టును చిత్తు చేశారు. మొదట బౌలింగ్‌లో కివీస్‌ను కట్టడి చేసిన భారత అమ్మాయిలు ఆ తర్వాత బ్యాట్‌తో సత్తా చాటారు. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, కెప్టెన్ మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ మహిళలు.. నిర్ణీత 50 ఓవర్లలో9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అమేలి కేర్(66) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ మరో హాఫ్ సెంచరీ (66)తో చెలరేగగా.. కెప్టెన్ డివైన్ (34), లారెన్ డౌన్ (30), జెన్సన్ (30) రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్, దీప్తి శర్మ, స్నేహ రానా రెండేసి వికెట్లు తీయగా.. పూనమ్ యాదవ్, మేఘన సింగ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్.. 4 వికెట్లకు 252 పరుగులు చేసి విజయాన్నందుకుంది.


Click it and Unblock the Notifications
