For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Commonwealth Games 2022లో టీమిండియాకు మెడల్ ఖాయం: మిథాలీ రాజ్

Mithali Raj says We Have a Great Chance to Finish On the Podium

కోల్‌కతా: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు పతకం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అభిప్రాయపడింది. బర్మింగ్‌హామ్‌లో ఈ నెల 28న ఆరంభమయ్యే క్రీడల్లో మహిళల క్రికెట్‌ అరంగేట్రం చేయనున్న నేపథ్యంలో మిథాలీ మీడియాతో మాట్లాడింది.

''ఏదైనా పెద్ద ఈవెంట్‌కు ముందు సన్నాహం కీలకం. అది సరిగ్గా ఉండి, సరైన ప్రణాళికలు, వ్యూహాలతో బరిలోకి దిగితే మన జట్టుకు పోడియం మీద నిలబడే అవకాశం దక్కుతుంది. మన జట్టు సరైన దిశగానే సాగుతోందని అనుకుంటున్నా. టీ20 ఫార్మాట్‌లో తప్పులు చాలా స్వల్పంగా ఉంటాయి. ఇప్పుడు మనకు చాలా బలమైన టీమ్ అందుబాటులో ఉంది.

ప్రణాళికలను సరైన రీతిలో అమలు చేస్తే కాన్వెల్త్‌లో తప్పకుండా మెడల్ గెలుస్తాం. ఆ అవకాశం భారత్‌కు ఉంది. హర్మన్‌ప్రీత్‌ 2016 నుంచి టీ20ల్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తోంది. కామన్వెల్త్‌ క్రీడల్లో జట్టును నడిపించేందుకు ఆమెకు ఆ అనుభవం సరిపోతుంది'' అని మిథాలీ పేర్కొంది.

'శభాష్ మిథూ' పేరుతో వస్తున్న తన బయోపిక్ ప్రమోషన్ ఈవెంట్‌లో హీరోయిన్ తాప్సీతో కలిసి పాల్గొన్న మిథాలీ వెల్లడించింది. ఈ సినిమా తన హృదయానికి చాలా దగ్గరగా ఉందని వ్యాఖ్యానించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌పై మిథాలీ ప్రశంసలు కురిపించింది. హర్మన్‌కు చాలా అనుభవం ఉందన్న హైదరాబాదీ.. గతంలోనూ టీ20ల్లో టీమ్‌ను చాలా బాగా నడిపించిందని కొనియాడింది. గ్రూప్‌లో-ఎలో ఉన్న భారత్.. జూలై 29న జరిగే తొలి మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. పాకిస్థాన్, బార్బడోస్ ఈ గ్రూప్‌లో ఉన్న మిగతా రెండు జట్లు.

Story first published: Sunday, July 10, 2022, 8:53 [IST]
Other articles published on Jul 10, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+