For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిథాలీ రాజ్‌కు షాక్.. ధోనికి తగిలినట్టే మరో దెబ్బ

Mithali Raj demoted to Grade B in BCCI central contracts

న్యూఢిల్లీ : పురుషుల క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్టుల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చోటుదక్కలేదన్న విషయం తెలిసిందే. దీంతో ధోని భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది. దిగ్గజ క్రికెటర్, వరల్డ్‌కప్స్ విన్నింగ్ కెప్టెన్‌కు కాంట్రాక్టు ఇవ్వకపోవడంపై అతని అభిమానులు బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. అయితే మహిళల క్రికెట్‌లో లెజండరీ ప్లేయర్, 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఉన్న హైదరాబాద్ స్టార్ మిథాలీరాజ్‌కు ఈ కాంట్రాక్టుల వ్యవహారంలో నిరాశే ఎదురైంది. గురువారం ప్రకటించిన మహిళల జట్టు కాంట్రాక్ట్‌లలో వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ దిగువకు పడిపోయింది.

ఏ గ్రేడ్ నుంచి బ్రీ గ్రేడ్‌లోకి

ఏ గ్రేడ్ నుంచి బ్రీ గ్రేడ్‌లోకి

ఇప్పటి వరకు ‘ఎ' గ్రేడ్‌లో ఉన్న హైదరాబాద్ స్టార్ ప్లేయర్‌ను ‘బి' గ్రేడ్‌లోకి మార్చారు. టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతోంది. దీంతోనే ఆమె గ్రేడ్ మార్చినట్లు తెలుస్తోంది. గతంలో టెస్ట్‌ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న ధోనిని కూడా ఎ+ గ్రేడ్ నుంచి ఎ గ్రేడ్‌కు మార్చింది. అలాగే ఇప్పుడు మిథాలీకి డిమోషన్ లభించింది.

పూనమ్ యాదవ్‌కు చోట..

పూనమ్ యాదవ్‌కు చోట..

‘ఎ' గ్రేడ్‌లో టీ20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ , ఓపెనర్‌ స్మృతి మంధాన తమ స్థానాలు నిలబెట్టుకోగా, కొత్తగా లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌కు ఈ లిస్ట్‌లో చోటు దక్కింది. ఇటీవల భారత్‌ విజయాల్లో పూనమ్‌ కీలక పాత్ర పోషించింది. రాధ యాదవ్, తాన్యా భాటియాలకు ‘సి' గ్రేడ్‌నుంచి ‘బి'లోకి ప్రమోషన్‌ లభించగా, యంగ్ సెన్సేషన్ 15 ఏళ్ల షఫాలీ వర్మకు తొలిసారి కాంట్రాక్ట్‌ దక్కింది. తెలుగు అమ్మాయి అరుంధతీ రెడ్డి సి గ్రేడ్ కాంట్రాక్ట్ జాబితాలో ఉంది. మహిళల జట్టు కాంట్రాక్ట్‌లు కూడా మెన్స్ క్రికెట్ కాంట్రాక్టుల్లానే 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబర్‌ వరకు వర్తిస్తాయి. ఇక మహిళల కాంట్రాక్టుల్లో ఎ గ్రేడ్‌ వారికి రూ.50 లక్షలు, బి క్రికెటర్లకు రూ.30 లక్షలు, సి గ్రేడ్ అమ్మాయిలకు రూ.10 లక్షల వార్షిక వేతనం లభించనుంది.

కొత్త కాంట్రాక్ట్‌ జాబితా (గ్రేడ్‌లవారీగా)

కొత్త కాంట్రాక్ట్‌ జాబితా (గ్రేడ్‌లవారీగా)

‘ఎ' హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్‌ యాదవ్‌

‘బి' మిథాలీ రాజ్, ఏక్తా బిష్త్, జులన్ గోస్వామి, శిఖా పాండే, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, తాన్యా బాటియా, రాధ యాదవ్

‘సి' హేమలత, అనూజ పాటిల్, వేద కృష్ణమూర్తి, మాన్సి జోషి, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి గైక్వాడ్, పూజ వస్త్రాకర్, హర్లీన్ డియోల్, ప్రియ పూనియా, పూనమ్‌ రౌత్, షఫాలీ వర్మ

Story first published: Friday, January 17, 2020, 10:35 [IST]
Other articles published on Jan 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+