Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా కెప్టెన్! అక్కడ సచిన్.. ఇక్కడ మిథాలీ!!

Mithali Raj Becomes Leading Run Scorer In Womens International Cricket Across all Formats

వొర్సెస్టర్‌: భారత మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. శనివారం ఇంగ్లండ్ ​మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో ఈ ఫీట్​ అందుకున్నారు మిథాలీ. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌​ (10,273) ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాటర్​గా ఉన్నారు. ఆమెను దాటేందుకు మిథాలీకి శనివారం నాటి ఇన్నింగ్స్‌లో కేవలం 12 పరుగులు అవసరం అయ్యాయి.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు

ఇంగ్లండ్ ​మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో మిథాలీ రాజ్‌ (86 బంతుల్లో 75 నాటౌట్‌; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశారు. వ్యక్తిగత స్కోరు 12 పరుగులకు చేరుకున్నపుడు మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా మిథాలీ అవతరించారు. చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ (10273 పరుగులు) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది.

ప్రస్తుతం మిథాలీ మూడు ఫార్మాట్‌లలో కలిపి 10337 పరుగులు (11 టెస్టుల్లో 669; 217 వన్డేల్లో 7304; 89 టీ0 మ్యాచ్‌ల్లో 2364 పరుగులు) చేశారు. పురుషుల క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ ఉన్న విషయం తెలిసిందే. సచిన్ 34357 పరుగులు చేశారు. ప్రస్తుతం పురుషుల, మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఇద్దరు భారత ప్లేయర్స్ కావడం విశేషం.

22 సంవత్సరాలు పూర్తి

22 సంవత్సరాలు పూర్తి

సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ ఇటీవలే ఓ అరుదైన ఘనతను అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ తర్వాత సుదీర్ఘ కాలం ఆడిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. 1999 జూన్‌ 26న మిథాలీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు.

గత ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచుతో 22 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు మహిళల క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌ కూడా 38 ఏళ్ల మిథానే ఉన్నారు. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో మిథాలీ అనేక రికార్డులను సృష్టించారు. మిథాలీ భారత్ తరఫున 11 టెస్టులు, 217 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 669, వన్డేలలో 7304, టీ20లలో 2364 పరుగులు చేశారు. మొత్తంగా 8 సెంచరీలు చేశారు.

Ollie Robinson: రాబిన్సన్‌పై నిషేధం ఎత్తివేత.. భారత్‌తో టెస్టు సిరీస్‌కు రైట్ రైట్!!

రాణించిన దీప్తి శర్మ

రాణించిన దీప్తి శర్మ

ఇంగ్లండ్ ​జట్టుతో జరిగిన మూడో వన్డేలో మిథాలీ రాజ్ అజేయ అర్ధ సెంచరీ సాధించడంతో పాటు చివరి వరకు క్రీజులో నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దాంతో చివరిదైన మూడో వన్డేలో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ మహిళల జట్టుపై గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 219 పరుగులు చేసింది. నాట్‌ స్కివర్‌ (49; 5 ఫోర్లు), కెప్టెన్‌ హీతర్‌ నైట్‌ (46; 4 ఫోర్లు) రాణించారు. దీప్తి శర్మ 3 వికెట్లు తీశారు.

మిథాలీ షో

మిథాలీ షో

లక్ష్యఛేదనలో భారత్‌ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 46.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు స్మృతి మంధాన (49; 8 ఫోర్లు), షెఫాలీ వర్మ (19; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (16), దీప్తి శర్మ (18; 1 ఫోర్‌) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ విజయంపై అనుమానాలు తలెత్తాయి.

అయితే మిథాలీ.. స్నేహ్‌ రాణా (22 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. చివర్లో స్నేహ్‌ అవుటవ్వగా.. భారత విజయ సమీకరణం 6 బంతుల్లో 6 పరుగులుగా ఉంది. చివరి ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు పరుగులు రాగా.. మూడో బంతిని బౌండరీ బాదిన మిథాలీ భారత్‌కు విజయాన్ని అందించారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఓడటంతో సిరీస్‌ను 1-2తో ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది.

Story first published: Sunday, July 4, 2021, 12:27 [IST]
Other articles published on Jul 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+