Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ollie Robinson: రాబిన్సన్‌పై నిషేధం ఎత్తివేత.. భారత్‌తో టెస్టు సిరీస్‌కు రైట్ రైట్!!

England pacer Ollie Robinson Free To Resume cricket Career After Old Tweets Storm

లండన్: ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ ఒలీ రాబిన్‌సన్‌కు భారీ ఊరట లభించింది. గతంలో జాతివివక్ష, విద్వేషాలకు సంబంధించిన ట్వీట్లు చేయడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) జూన్ నెలలో అతడిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణ పూర్తి చేసిన ఈసీబీ.. రాబిన్‌సన్‌పై మొత్తంగా 8 మ్యాచ్‌ల నిషేధం, 3200 పౌండ్ల జరిమానా విధించింది. మరోవైపు ఇప్పటికే మూడు మ్యాచ్‌లకు దూరమైన రాబిన్‌సన్‌.. మరో ఐదు మ్యాచ్‌లను రెండేళ్ల కాలపరిమిలో నిషేధం ఎదుర్కోవాల్సి ఉంది. దాంతో ఇప్పుడతడు వెంటనే ఇంగ్లండ్ జట్టులో కలిసే అవకాశం దక్కింది.

 జాతివివక్ష ట్వీట్లు

జాతివివక్ష ట్వీట్లు

ఇంగ్లండ్ గత నెల న్యూజిలాండ్‌తో ఆడిన తొలి టెస్టులోనే ఒలీ రాబిన్‌సన్‌ అరంగేట్రం చేశాడు. అదే సమయంలో 2012-13 కాలంలో అతడు చేసిన జాతివివక్ష, విద్వేషపూరిత ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో రాబిన్సన్ క్షమాపణలు చెప్పాడు. 'నేను జాత్యహంకారిని, సెక్సిస్ట్‌ని కాదని స్పష్టం చేయాలనుకుంటున్నా.

నా తప్పిదంకు తీవ్రంగా చింతిస్తున్నా. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడుతున్నా. ఆ సమయంలో నేను ఆలోచనా రహితంగా, బాధ్యతారహితంగా ఉన్నా. నా మానసికస్థితి సరిగా లేదు. నా చర్యలు క్షమించరానివి. ఆ ట్వీట్లకు పూర్తిగా చింతిస్తున్నా.ఇపుడు నేను ఒక వ్యక్తిగా పరిణతి చెందా' అని రాబిన్సన్ పేర్కొన్నాడు.

నిషేధం ఎత్తివేత

నిషేధం ఎత్తివేత

ఒలీ రాబిన్‌సన్‌ క్షమాపణ చెప్పినప్పటికీ.. ఈసీబీ అతనిపై చర్యలు తీసుకుంది. రాబిన్సన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో రాబిన్‌సన్‌ కెరీర్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాను గతంలో తెలియక చేసిన పొరపాటుకు రాబిన్‌సన్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాడు.

ఈ నేపథ్యంలోనే పూర్తి విచారణ చేసిన ఈసీబీ ఇప్పుడు 8 మ్యాచ్‌ల నిషేధం, జరిమానా విధించి కెరీర్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంది. లార్డ్స్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో రాబిన్‌సన్‌ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ లోయర్‌ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేశాడు.

Euro 2020: 29 ఏళ్ల తర్వాత సెమీఫైనల్‌కు డెన్మార్క్‌.. ఇటలీ గోల్ ఆనందం!!

పాత ట్వీట్‌లను డిలీట్ చేసి దొరికిపోయారు

పాత ట్వీట్‌లను డిలీట్ చేసి దొరికిపోయారు

ఒలీ రాబిన్‌సన్‌ పాత ట్వీట్‌లను ఈసీబీ సీరియస్‌గా తీసుకోవడంతో.. ఇంగ్లండ్ జట్టులోని మిగిలిన క్రికెటర్లు కూడా అలెర్ట్ అయ్యారు. ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్టార్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ తదితరులు తమ పాత ట్వీట్‌లను డిలీట్ చేసి దొరికిపోయారు. అయితే వీరిపై చర్యలు తీసుకోకుండా కేవలం రాబిన్‌సన్‌పై మాత్రమే నిషేధం విధించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధం

భారత్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధం

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒలీ రాబిన్‌సపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఈసీబీ ప్రకటించింది. దాంతో టీమ్ సెలక్షన్‌కి అతను అందుబాటులో ఉండనున్నాడు. టీమిండియాతో జరిగే టెస్ట్ సిరిసులో రాబిన్‌సన్ కీలక పాత్ర పోషించే అవకాశ ఉంది.

Story first published: Sunday, July 4, 2021, 11:51 [IST]
Other articles published on Jul 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+