Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes: ఓటమి దిశగా ఇంగ్లండ్.. ఆధిపత్యం ఆసీస్‌దే!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ ఇంగ్లండ్ ఓటమి దిశగా సాగుతోంది. 177 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. జాక్‌క్రాలీ(59 బంతుల్లో 6 ఫోర్లతో 44) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో రాణించిన జోరూట్(15) తీవ్రంగా నిరాశపర్చాడు. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్(4 బ్యాటింగ్)తో పాటు విల్ జాక్స్(4 బ్యాటింగ్) ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మైఖేల్ నేజర్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు తీసారు. ప్రస్తుతం ఆసీస్ 43 పరుగుల వెనుకంజలో ఉంది.

Mitchell Starc Strikes Late as England Finish Six Down at Stumps in 2nd Ashes Test

అంతకుముందు 378/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిచెల్ స్టార్క్(141 బంతుల్లో 13 ఫోర్లతో 77) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒక్క బ్యాటర్ సెంచరీ చేయకుండానే.. ఆసీస్ 511 పరుగుల భారీ స్కోర్ చేయడం గమనార్హం. ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(4/152) నాలుగు వికెట్లు తీయగా.. బెన్ స్టోక్స్(3/113) మూడు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, విల్ జాక్స్ తలో వికెట్ తీసారు. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి తప్పించుకోలేదు.

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 334 ఆలౌట్

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 511 ఆలౌట్

ఇంగ్లండ్ రెండో ఇన్నిగ్స్ 134/6

Story first published: Saturday, December 6, 2025, 21:21 [IST]
Other articles published on Dec 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+