Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mitchell Starc: ఈ పిచ్‌పై బ్యాటింగ్‌ కష్టం.. డ్యూపైనే మా ఆశలు!

Mitchell Starc: అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉందని ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదిక భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. దాంతో టీమిండియా 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే నమోదు చేసింది.

ఫస్ట్ ఇన్నింగ్స్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన స్టార్క్.. డ్యూ రావడంపైనే తమ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయని తెలిపాడు.

Mitchell Starc says Its not an easy wicket to bat on in World Cup 2023 Final

'పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉంది. అందుకుతగ్గట్లు బౌలింగ్ చేసాం. అయితే సీమ్, స్వింగ్ బౌలింగ్‌కు పెద్ద హెల్ప్ లభించలేదు. దాంతో విభిన్నమైన లెంగ్త్‌ను పరిశీలించాం. కమిన్స్, జోష్ హజెల్ వుడ్ అసాధారణంగా బౌలింగ్ చేశారు. ఇన్నింగ్స్ చివర్లో రివర్స్ స్వింగ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. మేం భారత్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశామని భావిస్తున్నాం.

ఇదే పిచ్‌పై ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశాం. అప్పుడు డ్యూ వచ్చింది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు ఏ మాత్రం అనుకూలం కాదు. డ్యూ వస్తేనే పరుగులు రాబట్టవచ్చు.'అని మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు.

టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్(4)తో పాటు కేఎల్ రాహుల్(66), మహమ్మద్ షమీ(6)లను స్టార్క్ పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. మహమ్మద్ షమీ ధాటికి రెండో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది.

Story first published: Sunday, November 19, 2023, 18:48 [IST]
Other articles published on Nov 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+