For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

15 బంతుల్లో 5 వికెట్లు!

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 5 వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గా రికార్డ్ సాధించాడు. వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 15 బంతుల్లోనే 5 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ మిచెల్ స్టార్క్‌కు 100వ టెస్ట్ మ్యాచ్ కావడం. తన సెంచరీ మ్యాచ్‌ను అరుదైన రికార్డ్‌తో చిరస్మరణీయం చేసుకున్నాడు. మిచెల్ స్టార్క్ ధాటికి ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 176 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(48), కామెరూన్ గ్రీన్(46) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం వెస్టిండీస్ 143 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ పేసర్లు స్కాట్ బోలాండ్(3/34), ప్యాట్ కమిన్స్ (2/24), జోష్ హజెల్ వుడ్(2/32) సమష్టిగా రాణించి విండీస్ పతనాన్ని శాసించారు. మిచెల్ స్టార్క్(1/32) ఒక్క వికెట్ మాత్రమే తీసాడు. 83 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 121 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్(42) ఒక్కడే రాణించాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్(5/27) ఐదు వికెట్లతో రాణించాడు.

Mitchell Starc Creates History in 100th Test Breaks 78-Year-Old Record

78 ఏళ్ల రికార్డ్ బద్దలు..

అనంతరం వెస్టిండీస్.. మిచెల్ స్టార్క్(6/9) ధాటికి 27 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో స్టార్క్ మొత్తం 7.3 ఓవర్లు వేసాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్.. తన మూడో ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 15 బంతుల్లో 5 వికెట్లు తీసాడు. ఈ క్రమంలో అతను 78 ఏళ్ల రికార్డ్‌ను అధిగమించాడు. 1947లో ఆస్ట్రేలియా బౌలర్ ఎర్నీ తోషాక్ 19 బంతుల వ్యవధిలోనే ఐదు వికెట్లు తీసాడు. బ్రిస్బేన్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా నమోదైన ఐదు వికెట్లు ఘనతలు..

15 బంతులు - మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) vs వెస్టిండీస్, కింగ్‌స్టన్, 2025

19 బంతులు - ఎర్నీ తోషాక్ (ఆస్ట్రేలియా) vs భారత్, బ్రిస్బేన్, 1947

19 బంతులు - స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) vs ఆస్ట్రేలియా, నాటింగ్‌హామ్, 2015

19 బంతులు - స్కాట్ బోలాండ్ (ఆస్ట్రేలియా) vs ఇంగ్లాండ్, మెల్‌బోర్న్, 2021

21 బంతులు - షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) vs దక్షిణాఫ్రికా, కేప్ టౌన్, 2011

Story first published: Tuesday, July 15, 2025, 9:56 [IST]
Other articles published on Jul 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+