For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. 34 ఏళ్లలో ఒకే ఒక్కడిగా..!

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. 34 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్‌లో 10 వికెట్ల ఘనతను అందుకున్న తొలి ఆసీస్ పేసర్‌గా నిలిచాడు. అంతేకాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. యాషెస్ సిరీస్ 2025లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో మిచెల్ స్టార్క్ ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో (7/58) ఏడు వికెట్లు తీసిన స్టార్క్.. రెండో ఇన్నింగ్స్‌లో (3/55) మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా 12 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో 10 వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు.యాషెస్ సిరీస్‌లో చివరిసారిగా ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 10 వికెట్ల ఘనతను అందుకున్నాడు. 2013లో చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్ 11 వికెట్లు పడగొట్టాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌కే చెందిన జేమ్స్ అండర్సన్ నాటింగ్‌హమ్ టెస్ట్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.

Mitchell Starc Becomes First Australian Pacer in 34 Years to Claim a 10-Wicket Haul in the Ashes

34 ఏళ్ల తర్వాత..

ఆస్ట్రేలియా తరఫున క్రైగ్ మెక్‌డెర్మోట్ మాత్రమే యాషెస్ సిరీస్‌లో 10 వికెట్ల ఘనతను అందుకున్నాడు. అతను 1991లో పెర్త్ టెస్ట్‌లో ఈ ఫీట్ సాధించాడు. 34 ఏళ్ల తర్వాత ఆసీస్ తరఫున మిచెల్ స్టార్క్ పెర్త్ వేదికగానే ఈ ఫీట్ సాధించడం గమనార్హం. డబ్ల్యూటీసీలో 200 వికెట్ల మైలు రాయి అందుకున్న మూడో ఆసీస్ బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. ఈ జాబితాలో నాథన్ లయన్, ప్యాట్ కమిన్స్ స్టార్క్ కంటే ముందున్నారు.

విజయం ముంగిట ఆసీస్

ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం ముంగిట నిలిచింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. ట్రావిస్ హెడ్ దూకుడైన బ్యాటింగ్‌తో విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఇక 40 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 164 పరుగులకు ఆలౌటైంది. గస్ అట్కిన్సన్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), ఓలీ పోప్(57 బంతుల్లో 2 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/55)తో పాటు స్కాట్ బోలాండ్(4/33) నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్రెండన్ డొగ్గెట్(3/51) మూడు వికెట్లు తీసాడు.

అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్ క్యారీ(26), కామెరూన్ గ్రీన్(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బెన్ స్టోక్స్(5/23) ఐదు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ (3/45) మూడు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్(2/11)‌కు రెండు వికెట్లు దక్కాయి.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 172 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్(61 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓలీ పోప్(58 బంతుల్లో 4 ఫోర్లతో 46), జెమీ స్మిత్(22 బంతుల్లో 6 ఫోర్లతో 33) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(7/58) ఏడు వికెట్లతో నిప్పులు చెరిగాడు. బ్రెండన్ డొగ్గెట్(2/27) రెండు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Saturday, November 22, 2025, 14:30 [IST]
Other articles published on Nov 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+