చెన్నై: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ కివీస్ ఆల్‌రౌండర్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. అతని సెన్సేషనల్ ఫీల్డింగ్‌కు అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(8) నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కివీస్ పేసర్ లాకీ ఫెర్గూసన్ వేసిన 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని ఫెర్గూసన్ షాట్ పిచ్‌గా వేయగా.. హష్మతుల్లా లెగ్ సైడ్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సరిగ్గా టైమ్ కానీ బంతి గాల్లోకి లేచింది. స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సాంట్నర్.. వెనక్కి పరుగెత్తుతూ ఎగిరి ఒంటి చేత్తో అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను చూసిన నెటిజన్లు వావ్ అని కామెంట్ చేస్తున్నారు. క్యాచ్ ఆఫ్ ది టోర్నీ అని కొనియాడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్.. 149 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. చెత్త ఫీల్డింగ్, పేలవ బ్యాటింగ్ అఫ్గాన్ పతనాన్ని శాసించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్(74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), గ్లేన్ ఫిలిప్స్(80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71), విల్ యంగ్( 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఓమర్జాయి, నవీన్ ఉల్ హక్ రెండేసి వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. రెహ్మత్ షా(36), అజ్మతుల్లా ఓమార్జాయ్(27) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/39), లాకీ ఫెర్గూసన్(3/19) తీన్మార్ వేయగా.. ట్రెండ్ బౌల్ట్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసారు. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించి సంచలన విజయాన్ని నమోదు చేసిన అఫ్గాన్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది.