Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mitchell Santner: అందుకే ఓడిపోయాం.. కివీస్ తాత్కలిక సారథి

Mitchell Santner says Credit Needs To Be Given To India

కోల్‌కతా: తీరిక లేని షెడ్యూల్ కారణంగానే భారత్‌తో టీ20 సిరీస్‌లో ఓటమిపాలయ్యామని న్యూజిలాండ్ తాత్కలిక సారథి మిచెల్ సాంట్నర్ అన్నాడు. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ల జోరును అడ్డుకోవడంలో తాము విఫలమయ్యామని తెలిపాడు. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 73 పరుగుల తేడాతో గెలుపొందింది.

టీ20 ప్రపంచకప్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే ఈ సిరీస్ జరగడంతో ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ విశ్రాంతి తీసుకున్నాడు. దాంతో కివీస్ ఇద్దరు సారథులను నియమించింది. తొలి రెండు మ్యాచ్‌లకు టీమ్ సౌథీ నాయకత్వం వహించగా.. చివరి మ్యాచ్‌కు శాంట్నర్ జట్టు పగ్గాలు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ ఓటమి అనంతరం.. మాట్లాడిన సాంట్నర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

 క్రెడిట్ భారత్‌దే..

క్రెడిట్ భారత్‌దే..

'ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఆదిలోనే అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా అక్షర్ అదరగొట్టాడు. ఈ సిరీస్ మొత్తంలో మాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన భారత జట్టుకే క్రెడిటంతా దక్కుతుంది. నిజం చెప్పాలంటే మేమంతా సరిగ్గా ఆడలేదు. ఇక రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మాపై తీసుకొచ్చే ఒత్తిడి నుంచి తేరుకోవడం చాలా కష్టం.

మా జట్టులో కేన్ విలియమ్సన్ గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు. విపరీతమైన మా షెడ్యూల్ కారణంగా అతనీ సిరీస్ ఆడలేదు. దీంతో కొందరు యువకులకు అవకాశాలు వచ్చాయి. తర్వాతి టీ20 ప్రపంచకప్ మరో 11 నెలల్లోనే ఉండటంతో ఇకపై ఎలా ఆడాలనేది ఆలోచించాలి. ఇవాళ మా జట్టులో గప్టిల్ బాగా ఆడాడు.

సొంతగడ్డపై ఓడించడం..

సొంతగడ్డపై ఓడించడం..

స్వదేశంలో టీమిండియాను ఓడించడం చాలా కష్టం. టెస్ట్ సిరీస్‌లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏ ఫార్మాట్​లో అయినా భారత్‌ను ఎదుర్కోవడం కఠినమైన సవాల్. 2016లోనే మాకు ఆ అనుభవం ఉంది. కాన్పూర్​లో తొలి టెస్టుకు మా కుర్రాళ్లు​ సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నా.

మాకు మంచి స్పిన్నర్లున్నారు. ఎందుకంటే ఈ సిరీస్​లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుంది. స్వదేశంలో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ చెలరేగిపోతారు. తమకు కూడా అజాజ్, సోమర్​విల్​ వంటి మంచి స్పిన్నర్లు ఉన్నారు. 'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.

సమష్టిగా చెలరేగి..

సమష్టిగా చెలరేగి..

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌' కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (21 బంతుల్లో 29; 6 ఫోర్లు) మెరిశారు. చివర్లో దీపక్‌ చహర్‌ (8 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ ఆటతీరుతో భారత్‌ భారీ స్కోరు ను అందుకుంది. ఛేదనలో న్యూజిలాండ్‌ 17.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది.

ఓపెనర్‌ గప్టిల్‌ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా మిగిలినవారు విఫలమయ్యారు. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అక్షర్‌ పటేల్‌ (3/9), హర్షల్‌ పటేల్‌ (2/26) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. న్యూజిలాండ్‌ తాత్కాలిక సారథి సౌతీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్‌లో సాన్‌ట్నర్‌ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు.

నవంబర్ 25 నుంచి..

నవంబర్ 25 నుంచి..

మూడు టీ20ల సిరీస్ ముగియడంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది. నవంబరు 25- 29 వరకు ఈ మ్యాచ్ జరగనుండగా.. డిసెంబరు 3- 7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరుగనుంది. ఇక ఈ సిరీస్‌ నుంచి టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, రిషభ్ పంత్ విశ్రాంతి తీసుకోగా.. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. దాంతో ఫస్ట్ మ్యాచ్‌లో అజింక్యా రహానే భారత జట్టును నడిపించనుండగా.. పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్లుగా వృద్దీమాన్ సాహా, తెలుగు క్రికెట్ కేఎస్ భరత్‌లు చోటు దక్కించుకున్నారు.

Story first published: Monday, November 22, 2021, 15:46 [IST]
Other articles published on Nov 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+