ఫుల్‌టాస్ బాల్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔటవ్వడం తనను షాక్‌కు గురిచేసిందని న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఫుల్‌టాస్ బాల్ ఆడలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మిచెల్ సాంట్నర్ ఊరించే ఫుల్‌టాస్ బాల్ వేయగా.. కోహ్లీ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆగి వస్తున్న బంతిని సరిగ్గా అంచనా వేయలేక బ్యాట్‌ను అడ్వాన్స్ ఊపి మూల్యం చెల్లించుకున్నాడు. దిగ్గజ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ ఫుల్‌టాస్‌కు ఔటవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పేలవ రీతిలో కోహ్లీ ఔటవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

తన కెరీర్‌లోనే కోహ్లీ అత్యంత చెత్త షాట్ ఆడాడంటూ సంజయ్ మంజ్రేకర్ కామెంట్ చేయగా.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. రెండో రోజు ఆట అనంతరం మాట్లాడిన మిచెల్ సాంట్నర్.. కోహ్లీ ఔటవ్వడంపై ప్రత్యేకంగా మాట్లాడాడు. 'కోహ్లీ అలా ఔటవ్వడం షాక్‌కు గురి చేసింది. అది చాలా స్లోయర్ బాల్. రెండో రోజు ఆటలో ఛేంజ్ ఆఫ్ పేస్ కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌ను నిశితంగా పరిశిలించాను. అతన బౌలింగ్ చూడటం నాకు కలిసొచ్చింది. ముఖ్యంగా వైడ్ ఆఫ్ క్రీజ్‌లో అతను బంతులు వేయడం గమనించాను. అచ్చం అతనిలానే నేను కూడా బౌలింగ్ చేసి సానుకూల ఫలితాన్ని రాబట్టాను..'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో మిచెల్ సాంట్నర్(7/53) ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. టెస్ట్ కెరీర్‌లోనే తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకోవడంతో పాటు అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. 2015లో టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాంట్నర్.. ఇప్పటి వరకు ఐదు వికెట్లు ఘనతను అందుకోలేదు. పుణే వేదికగా ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌పై న్యూజిలాండ్ పట్టు బిగిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. క్రీజులో టామ్ బ్లండెల్(30 బ్యాటింగ్) తో పాటు గ్లేన్ ఫిలిప్స్(9 బ్యాటింగ్) ఉన్నాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఆధిక్యం 301 పరుగులకు చేరింది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం కష్టం.
అంతకుముందు 16/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(7/53) స్టన్నింగ్ బౌలింగ్‌తో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసిన విషయం తెలిసిందే. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) కివీస్ పతనాన్ని శాసించారు.