Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BBL ఛాంపియన్‌గా హోబర్ట్ హరికేన్స్.. వార్నర్ టీమ్‌ ఓటమి!

ఆస్ట్రేలియా టీ20 ఫ్రాంచైజీ టోర్నీ బిగ్ బాష్ లీగ్‌ 2024-25లో హోబర్ట్ హరికేన్స్ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ 7 వికెట్ల తేడాతో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సిడ్నీ థండ‌ర్‌ను ఓడించింది. ఈ గెలుపుతో నాథన్ ఎల్లిస్ సారథ్యంలోని హోబర్ట్ హరికేన్స్ తొలి బీబీఎల్ టైటిల్‌ను అందుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. జాసన్ సంఘా(42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67), డేవిడ్ వార్నర్(32 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 48) రాణించారు. హోబర్ట్ హరికేన్స్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్(3/23), రిలీ మెరిడిత్(3/27) మూడేసి వికెట్లు తీసారు.

Mitchell Owen s record century helps Hobart Hurricanes to maiden BBL title
Photo Credit: X

అనంతరం హోబర్ట్ హరికేన్స్ 14.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 185 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మిచెల్ ఓవెన్(42 బంతుల్లో 6 ఫోర్లు, 11 సిక్స్‌లతో 108) సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ వెడ్(17 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

సిడ్నీ థండర్ బౌలర్లలో తన్వీర్ సంఘా(2/42) రెండు వికెట్లు తీయగా.. టామ్ ఆండ్రూస్ ఓ వికెట్ పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన మిచెల్ ఓవెన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

ఈ మ్యాచ్‌లో శతకం ద్వారా మిచెల్ ఓవెన్ సరికొత్త చరిత్ర లిఖించాడు. 39 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న మిచెల్.. బీబీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మిచెల్ ఓవెన్ కంటే ముందు క్రైగ్ సిమ్మన్స్ కూడా 39 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఈ జాబితాలో గ్లేన్ మ్యాక్స్‌వెల్(41 బంతులు), జోష్ బ్రౌన్ (41 బంతులు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

Story first published: Monday, January 27, 2025, 18:10 [IST]
Other articles published on Jan 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+