For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand: అర్థం పర్థం లేని సిరీస్.. కివీస్ మాజీ పేసర్ ఘాటు వ్యాఖ్యలు!

New Zealand cricketer Mitchell McClenaghan weighed in on the ongoing India vs New Zealand T20I series with a remark that didnt go down well with the Indian fans. The out of favor New Zealand player used the phrase meaningless series to define the T20I series which New Zealand lost with a game still to play. While replying to a fans remark, McClenaghan also stressed on the fact that New Zealand toured India 72 hours after losing the T20 World Cup final vs Australia and had to play three games within a span of five days. He also reminded the fan that India enjoyed a 10-day rest after bowing out of the T20 World Cup early.

న్యూఢిల్లీ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ అర్థం పర్థం లేనిదని కివీస్ మాజీ పేసర్ మిచెల్ మెక్లన్‌గన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్ ముగిసిన మూడో రోజుల్లోనే ఈ సిరీస్‌ను షెడ్యూల్ చేయడం బాలేదన్నాడు. దాంతో కివీస్ ఆటగాళ్లకు సరైన విశ్రాంతి లభించలేదన్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగానే న్యూజిలాండ్ సిరీస్ కోల్పోయిందని చెప్పుకొచ్చాడు. నేడు(ఆదివారం) కోల్‌కతా వేదికగా జరిగే మూడో టీ20తో ఈ సిరీస్ ముగియనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన భారత్ 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే విజయాన్నందుకుంది.

నవంబరు 14న టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్ మ్యాచ్ ముగియగా.. ఈ ఫైనల్‌కి చేరిన న్యూజిలాండ్ టీమ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత మూడు రోజుల్లోనే అంటే 17న జైపూర్‌లో ఫస్ట్ టీ20 మ్యాచ్ ఆడిన కివీస్.. 19న రాంచీ వేదికగా రెండో టీ20లో భారత్‌తో తలపడింది. మరోవైపు టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టిన టీమిండియాకి దాదాపు 10 రోజులు రెస్ట్ దొరికింది. దాంతో.. బిజీ షెడ్యూల్ కివీస్ ఓటమికి కారణమైందని మెక్లనగన్ చెప్పుకొచ్చాడు.

'భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ అర్థం పర్థం లేనిది. టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్లో ఓటమి తర్వాత కేవలం 72 గంటల్లోనే సిరీస్‌ ప్రారంభమైంది. అది కూడా కేవలం 5 రోజుల వ్యవధిలో మూడు టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి (భారత్‌)కి 10 రోజులు రెస్ట్ దొరికింది.. అది కూడా సొంతగడ్డపై ఆడుతోంది'' అని చెప్పుకొచ్చాడు. మెక్లన్ గన్ వ్యాఖ్యలతో అభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు. బయో- సెక్యూర్ బబుల్‌లో ఉన్న ఆటగాళ్లకి కాస్త విరామం ఇవ్వాల్పిందని అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా ప్రవర్తనతోనే బీసీసీఐ మూల్యం చెల్లించుకుందని, తీరిక లేని షెడ్యూల్‌ కారణంగానే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కనీసం సెమీస్ చేరకుండా ఇంటి దారి పట్టిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Story first published: Sunday, November 21, 2021, 16:53 [IST]
Other articles published on Nov 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+