Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మిచెల్ మార్ష్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి మరో ఆల్‌రౌండర్!

Mitchell Marsh ruled out of the IPL 2020, Jason Holder replaces him in Sunrisers Hyderbad

దుబాయ్‌: గాయంతో ఐపీఎల్ 2020 సీజన్ మొత్తానికి దూరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్ జాసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటించింది.

'గాయం కారణంగా మిచెల్ మార్ష్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. అతను త్వరగా కోలుకోవాలని మేం ప్రార్ధిస్తున్నాం. డ్రీమ్ 11 ఐపీఎల్ 2020లో జాసన్ హోల్డర్ అతని స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.'అని సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసింది.

ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 10 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మార్ష్ బౌలింగ్‌ చేస్తూ చీలమండ గాయానికి గురయ్యాడు. రెండో బంతికి ఫించ్‌ షాట్‌ను ఆపబోయి గాయపడిన మార్ష్.. మరో రెండు బంతులు మాత్రమే వేసి వెనుదిరిగాడు.

ఆ తర్వాత కుంటుకుంటూనే బ్యాటింగ్‌కు వచ్చి తొలి బంతికే అవుటయ్యాడు. అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మార్ష్ స్థానంలో మరో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ డానియెల్‌ క్రిస్టియాన్‌ పేరును పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మెనేజ్‌మెంట్ మాత్రం అనూహ్యంగా వెస్టిండీస్ క్రికెటర్ జాసన్ హోల్డర్‌ను తీసుకుంది.

కరోనా అనంతరం జాసన్ హోల్డ‌ర్‌కు మంచి ప్రాక్టీస్ ఉంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. ఆ తర్వాత సీపీఎల్ 2020 సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఫస్ట్ మ్యాచ్‌లో(69) హాఫ్ సెంచరీ మినహా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించింది లేదు. ఓ రెండు మ్యాచ్‌ల్లో మాత్రం 34, 38 పరుగులతో పర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో మాత్రం 12 వికెట్లు తీశాడు.

అయితే ఫారిన్ ప్లేయర్లు ఎక్కువగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. గత మ్యాచ్‌లోనే మహ్మద్ నబీనీ తీసుకోకుండా హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, జాసన్ హోల్డర్‌లతో కూడిన ఫారిన్ పూల్‌లో డేవిడ్ వార్నర్ బెయిర్ స్టో, రషీద్ ఖాన్ ఆడటం ఖాయం. పైగా హైదరాబాద్ పేస్ విభాగం భారత ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది.

దుబాయ్ పిచ్‌లు స్పిన్ అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మహ్మద్ నబీ ఆడించవచ్చు. అతను సీపీఎల్‌లో మంచి ఫామ్‌ కనబర్చాడు. ఈ పరిస్థితుల్లో జాసన్ హోల్డర్‌కు అంతగా అవకాశాలు రాకపోవచ్చు. మరోవైపు కేన్‌ విలియమ్సన్‌ తొడ గాయంతో బాధపడుతున్నాడు. అందుకే అతడు తొలి మ్యాచ్‌కు దూరం కావాల్సి వచ్చింది. విలియమ్సన్‌ ఎప్పటివరకు కోలుకుంటాడనే విషయంలో ఎలాంటి సమాచారం లేదు.

Mitchell Marsh ruled out of the IPL 2020, Jason Holder replaces him in Sunrisers Hyderbad
Story first published: Wednesday, September 23, 2020, 17:00 [IST]
Other articles published on Sep 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+