Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్ బౌలర్‌ను చితక్కొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్.. స్టేడియం బయట పడ్డ బంతి!(వీడియో)

పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ చితక్కొట్టాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న పురుషుల ది హండ్రెడ్ లీగ్‌లో భాగంగా ఆదివారం ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ మార్ష్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

అజింక్య రహానేకు బీసీసీఐ నుంచి పెన్షన్.. ప్రతి నెలా ఎంత వస్తుందో తెలుసా?

అజింక్య రహానేకు బీసీసీఐ నుంచి పెన్షన్.. ప్రతి నెలా ఎంత వస్తుందో తెలుసా?

ట్రెంట్ రాకెట్స్ ప్రధాన పేసర్ అయిన అమీర్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ కొట్టిన ఓ భారీ సిక్సర్‌ టాక్ ఆఫ్ ది లీగ్‌గా నిలిచింది. ఈ భారీ సిక్సర్ ధాటికి బంతి స్టేడియం బయట పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ 35 బంతుల్లో 41 పరుగులు చేసి 2 ఫోర్లు, 2 సిక్స్‌లే బాదినప్పటికీ భారీ సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు.

Mitchell Marsh Launches Monster Six Off Mohammad Amir That Clears the Stadium in The Hundred

కనుమరుగైన బంతి..

సన్‌రైజర్స్ లీడ్స్ ఇన్నింగ్స్ రెండో బంతినే మిచెల్ మార్ష్ మైదానం బయటకు పంపించాడు. ఈ సిక్సర్ ధాటికి బంతి కనిపించకుండా పోయింది. ఈ భారీ సిక్సర్‌కు మహమ్మద్ అమీర్ బిత్తరపోయాడు. ఆ తర్వాత అతను మెరుగ్గా రాణించి మిచెల్ మార్ష్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో మార్ష్ వెనుకడుగు వేయాల్సి వచ్చింది.

సన్‌రైజర్స్‌కు తప్పని పరాజయం..

చివరకు ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ 5 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్లకు 146 పరుగులు చేసింది. బెన్ డకెట్(47 బంతుల్లో 9 ఫోర్లతో 64), డొనాల్డ్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టాడు.

పాక్ క్రికెటర్‌ను హగ్ చేసుకున్న భారత క్రికెటర్.. నెటిజన్లు ఫైర్!(వీడియో)

పాక్ క్రికెటర్‌ను హగ్ చేసుకున్న భారత క్రికెటర్.. నెటిజన్లు ఫైర్!(వీడియో)

అనంతరం సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 4 వికెట్లకు 141 పరుగులే చేసి ఓటమిపాలైంది. మిచెల్ మార్ష్(41), హ్యారీ బ్రూక్(33 బంతుల్లో 4 ఫోర్లతో 46) పర్వాలేదనిపించారు. ట్రెంట్ రాకెట్ బౌలర్లలో మహమ్మద్ అమీర్ రెండు వికెట్లు తీయగా.. క్రైగ్ ఓవర్టన్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు. ఈ టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్‌కు ఇది రెండో పరాజయం. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ లీడ్స్.. 2 గెలిచి 2 ఓడి పాయింట్స్ టేబుల్‌లో 6వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ట్రెంట్ రాకెట్స్.. 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.

Story first published: Monday, August 3, 2026, 11:07 [IST]
Other articles published on Aug 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+