Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Mitchell Marsh: నా కప్ నా ఇష్టం.. అందులో తప్పేం ఉంది?

Mitchell Marsh: వన్డే ప్రపంచకప్ 2023 విజయానంతరం ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్ హద్దులు ధాటి ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశమైంది. విజయ గర్వంతో అతను చేసిన పని నెట్టింట వైరల్ కాగా.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆరోసారి టైటిల్ గెలిచామన్న సంతోషంలో ఆసీస్ టీమ్ చేసుకున్న సంబరాల్లో సోయి లేకుండా తాగిన మిచెల్ మార్ష్.. మద్యం మత్తులో వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి ఫొటోలకు ఫోజిచ్చాడు.

ఓ చేత్తో బీర్ పట్టుకొని రెండు కాళ్లను ప్రపంచకప్ ట్రోఫీపై ఉంచాడు. ఈ ఫొటోను చూసిన క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. విజయ గర్వం తలకెక్కిందని మండిపడ్డారు. కొందరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అభిమానులే కాకుండా క్రికెటర్లు, విశ్లేషకులు కూడా మిచెల్ మార్ష్‌ను తప్పుబట్టారు.

Mitchell Marsh breaks silence on his VIRAL photo with feet over World Cup trophy

ఈ ఘటనపై తొలిసారి స్పందించిన మిచెల్ మార్ష్ తన పనిని సమర్థించుకున్నాడు. ఇతర వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయాలనేది తన ఉద్దేశం కాదని తెలిపిన మిచెల్ మార్ష్.. గెలిచిన ఉత్సాహంలో అలా జరిగిపోయిందని వివరణ ఇచ్చాడు. అయినా ఇందులో ఎలాంటి తప్పిదం లేదని, తాను గెలిచిన ప్రపంచకప్ తన ఇష్టమని బదులిచ్చాడు.

'ప్రపంచకప్‌పై కాళ్లు పెడుతూ నేను దిగిన ఫోటోలో ఎలాంటి తప్పు కనిపించలేదు. నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, అది వైరల్ అయ్యిందని అందరూ నాకు చెబుతున్నప్పటికీ నేను సోషల్ మీడియాలో దానిని పెద్దగా చూడలేదు. అందులో ఏమీ లేదు. ఒకర్ని కించపరిచే ఉద్దేశంతో అలా చేయలేదు" అంటూ మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు. అయితే మరోసారి ఇలాంటి పనిచేస్తావా? అని ప్రశ్నిస్తే.. అవునని బదులిచ్చాడు.

నవరంబర్ 19న భారత్‌తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఆసీస్ సాధించిన ఈ విజయం కంటే.. మిచెల్ మార్ష్ ప్రవర్తన మీదే సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం జరిగింది. మిచెల్ మార్ష్ వరల్డ్‌కప్ ట్రోఫీ మీద కాళ్లు ఉంచడంపై టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మండిపడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లో అయితే ఏకంగా మిచెల్ మార్ష్ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ప్రపంచకప్ ట్రోఫీ మీద కాళ్లు ఉంచడం ద్వారా భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడంటూ మిచెల్ మార్ష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు పెట్టిన పిటిషనర్ మిచెల్ మార్ష్‌ను ఇండియాలో క్రికెట్ ఆడకుండా నిషేధించాలని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి కూడా ఎఫ్ఐఆర్ కాపీని పంపించాడు.

ఆ తర్వాత టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కూడా మిచెల్ మార్ష్ చర్యను తప్పుబట్టాడు. ప్రపంచకప్ కోసం ఎన్నోజట్లు పోటీపడుతుంటాయని.. అలాంటి ట్రోఫీ మీద కాలు వేయడం బాధించిందని చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ ట్రోఫీకి మర్యాద ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు.

Story first published: Friday, December 1, 2023, 16:27 [IST]
Other articles published on Dec 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+