Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా నాన్న మందలించాడు: శుభ్‌మన్ గిల్

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా టెస్ట్ కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. ఇంగ్లండ్ గడ్డపై తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ.. వరుసగా రెండో సెంచరీ చేయడమే కాకుండా దాన్ని డబుల్ సెంచరీగా మల్చుకున్నాడు. ట్రిపుల్ సెంచరీ దిశగా సాగిన అతను 269 పరుగుల వద్ద ఔటయ్యాడు. తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకోవడంపై తన తండ్రి అసంతృప్తి వ్యక్తం చేశాడని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ట్రిపుల్ సెంచరీ చేయకపోవడంపై మందలించాడని చెప్పాడు. రెండో రోజు మ్యాచ్ అనంతరం డబుల్ సెంచరీపై స్పందిస్తూ తన తండ్రి చేసిన కామెంట్స్‌ గురించి గిల్ పంచుకున్నాడు. 'నేను డబుల్ సెంచరీ కొట్టగానే మా నాన్న ఫోన్ చేసి నన్ను అభినందించాడు. అంతేకాకుండా ట్రిపుల్ సెంచరీ ఎందుకు మిస్ చేశావ్? అని అడిగాడు.'అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

శుభ్‌మన్ గిల్‌ను అభినందిస్తూ.. అతని తల్లిదండ్రులు పంపిన వాయిస్ మెసేజ్‌‌ను శుభ్‌మన్ గిల్ వింటున్న వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వాయిస్ మెసేజ్‌లో శుభ్‌మన్ గిల్‌ను అతని తల్లిదండ్రులు ప్రశంసించారు. 'అద్భుతంగా ఆడావు గిల్. నీ బ్యాటింగ్‌ను ఆస్వాదించా. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నీ ఆటను చూస్తుంటే.. నీ అండర్ 16, 19 రోజులు గుర్తుకువచ్చాయి. నిన్ను చూసి గర్వపడుతున్నా.'అని గిల్ తండ్రి లక్ష్యిందర్ సింగ్ తెలిపారు. 'నీ బ్యాటింగ్ చూస్తుంటే చాలా సంతోషమేసింది. మున్ముందూ ఇలాగే ఆడాలి'అని గిల్ తల్లి ఆకాంక్షించారు.

Missed My Triple Century Shubman Gill Reveals Father s Reaction to His Double Ton in IND vs ENG 2nd Test
Photo Credit: BCCI(X)

ఈ వీడియో తన తండ్రి గురించి గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ఇలాంటి వాయిస్ మెసేజ్‌లు ఆయన నుంచి నాకు ఎన్నో వస్తూనే ఉంటాయి. నేను ట్రిపుల్ సెంచరీ చేజార్చుకోవడంపై కూడా మేం మాట్లాడుకున్నాం. అయితే ఈ మ్యాచ్‌లో మేం గెలుస్తామనే నమ్మకం ఉంది. క్రికెట్‌కు సంబంధించిన నేను ఇద్దరి అభిప్రాయాలను గౌరవిస్తా. ఒకరు మా నాన్న అయితే మరొకరు నా ఫ్రెండ్ అభిషేక్ శర్మ. నాన్న కోసమే క్రికెట్ ఆడుతున్నా.. నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేసింది మాత్రం నా స్నేహితుడితోనే. ఈ ఇద్దరు చెప్పే మాటలు జాగ్రత్తగా వింటా'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, July 4, 2025, 16:04 [IST]
Other articles published on Jul 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+