Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Misbah-ul-Haq: 2007 టీ20 ప్రపంచకప్​ ఫైనల్లో నా ఓవర్ కాన్ఫిడెన్సే కొంపముంచింది!

Misbah-ul-Haq says ‘I got overconfident’ over missing the scoop in the T20 WC 2007 final against India

కరాచీ: భారత్‌తో జరిగిన 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ విజయానికి 4 బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సెట్ అయిన మిస్బా ఉల్ హక్ ఉండటంతో పాక్ విజయం లాంఛనమేనని అంతా భావించారు. కానీ.. జోగిందర్ శర్మ వేసిన బాల్‌ను మిస్బా ఉల్ హక్ పెడల్ స్వీప్ షాట్ ఆడాడు. అది నేరుగా వెళ్లి ఫైన్ లెగ్ ఫీల్డర్‌గా ఉన్న శ్రీశాంత్ చేతిలో పడింది. దాంతో భారత్ జగజ్జేతగా నిలవగా.. ఆ ఒక్క షాట్ పాక్ విజయాన్ని దూరం చేసింది. అయితే ఈ మ్యాచ్ ముగిసి 15 ఏళ్లు అయినా.. ఆ పెడల్ స్వీప్ షాట్‌ను మిస్బా ఉల్ హక్ మరిచిపోలేకపోతున్నాడు.

 ఓవర్ కాన్ఫిడెన్స్..

ఓవర్ కాన్ఫిడెన్స్..

తాజాగా తన మాజీ సహచర ఆటగాళ్లు షోయబ్ అక్తర్, మహమ్మద్ యూసఫ్‌తో కలిసి ఓ టీవీ షోలో మాట్లాడిన మిస్బా ఉల్ హక్.. ఆ పెడల్ స్వీప్ షాట్ మిస్ ఫైర్ అవ్వడానికి గల కారణాన్ని తెలియజేశాడు. తనకు ఎంతో ఫేవరేట్ షాట్ అయిన అది ఆ రోజు అతి విశ్వాసం కారణంగా మిస్ ఫైర్ అయ్యిందన్నాడు. '2007లో ప్రతి మ్యాచుల్లో స్కూప్​ షాట్​తో ఎన్నో ఫోర్లు బాదాను. ఆస్ట్రేలియాపై కూడా ఆ షాట్​తో బాగా ఆడాను. స్పిన్నర్లపై మంచి ప్రదర్శన చేశాను. కానీ ఫైనల్లో ఆ బంతి బాదేటప్పుడు నాలో ఆత్మవిశ్వసం ఎక్కువైంది. దీంతో బంతిని కొట్టే టైమింగ్​ తప్పింది. అందుకే ఔట్​ అయ్యాను" అని మిస్బా ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.

నా ఫేవరేట్ షాట్..

నా ఫేవరేట్ షాట్..

'ఆ ఓటమి వల్ల ఏర్పడిన బాధ ఇంకా ఉంది. నా కట్టే కాలేవరకు అది ఉండిపోతుంది. ఎందుకంటే అక్కడ గెలుపే ముఖ్యం. ఆ ఓటమితో నేను చాలా నిరుత్సాహానికి గురయ్యా. ఎందుకంటే ఫలితం దక్కనప్పుడు మనం పడిన కష్టమంతా వృథా అవుతుంది. నేను మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాను. సునాయసంగా గెలిచే మ్యాచ్ చేజారడం చాలా బాధను మిగిల్చింది. జరిగిందేదో జరిగిందని మర్చిపోదామన్నా కుదరడం లేదు. నేను ఆ షాట్ ఆడి తప్పు చేశానని చాలా మంది అంటుంటారు. కానీ, అది నిజం కాదు. నేను ఇంతకు ముందెప్పుడూ పెడల్ స్వీప్ షాట్ ఆడి ఔట్ కాలేదు. అది నా ఫేవరెట్ షాట్.

 పై నుంచి ఆడుదామని..

పై నుంచి ఆడుదామని..

ఫీల్డర్ ఫైన్ లెగ్‌ కంటే వెనకుంటే ఆ షాట్‌తో నాకు సింగిల్ వచ్చేది. ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో కూడా నేను అదే షాట్ కొట్టాను. స్కోర్ సమం చేయాలనుకున్నాను. అందుకే వికెట్ కీపర్‌పై నుంచి ఫోర్ కొట్టాలని భావించా. వాళ్లు ఫీల్డర్‌ను వెనక పెట్టుంటే, నేను సింగిల్ తీసుండేవాడిని. దగ్గరగా పెట్టడంతో అతని పైనుంచి కొట్టాలనుకున్నా. కానీ, ఆ పెడల్ స్వీప్ షాట్ మిస్ ఫైర్ అయింది. ఔటవ్వగానే నా ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. నేను ఆడే బెస్ట్ షాట్ అదేనని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. కానీ, ఆ సమయంలో సక్సెస్ కాలేదు.'అని మిస్బా పేర్కొన్నాడు.

గెలిచే మ్యాచ్‌లో..

గెలిచే మ్యాచ్‌లో..

157 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్​ తడబడింది. షాహిద్​ అఫ్రిది, యూనిస్​ ఖాన్​, మాలిక్ వంటి దిగ్గజ బ్యాటర్లను టీమ్​ఇండియా బౌలర్లు త్వరగా పెవిలియన్​ చేర్చారు. కానీ మిస్బా ఉల్​ హక్​ మాత్రం ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడి విజయానికి చాలా దగ్గరకు తీసుకొచ్చాడు. ఇక పాక్​ గెలుపు ఖాయమని అభిమానులు భావించారు. ఆ జట్టుకు చివరి ఓవర్లో 13 పరుగలు మాత్రమే అవసరం. ఆ ఓవర్​లో జోగిందర్​ శర్మ వేసిన రెండో బంతిని సిక్సర్​గా మలిచి భారత్​ గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక మూడో బంతికి స్కూప్​ షాట్​ ఆడబోయి శ్రీశాంత్​ చేతికి క్యాచ్​ ఇచ్చి ఔట్​ అయ్యాడు. దీంతో భారత్​ ఐదు పరుగుల తేడాతో గెలిచింది.

Story first published: Saturday, January 29, 2022, 14:55 [IST]
Other articles published on Jan 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+