Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravi Shastriకి ఆర్టీ-పీసీఆర్ టెస్టులోనూ పాజిటివ్‌.. ఇదో టెస్టుకు దూరం! ఐసొలేషన్‌లోనే అరుణ్‌, శ్రీధర్‌!!

Indian Head Coach Ravi Shastri Tests Covid Positive And To Miss Out The Final Test Match vs England

లండన్: టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌ అన్న విషయం తెలిసిందే. ఆదివారం చేసిన రాపిడ్ పరీక్షల్లో అతడికి పాజిటివ్‌ అని తేలినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం వెల్లడించింది. ఇక సోమవారం వచ్చిన ఆర్టీ-పీసీఆర్ టెస్టులోనూ రవిశాస్త్రికి పాజిటివ్‌ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టుతో సహా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఐదవ టెస్టుకు కూడా అతడు దూరమయ్యాడు. రవిశాస్త్రితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ ఇప్పటికే ఐసొలేషన్‌లోకి వెళ్లారు. దాంతో కోచ్‌ల మద్దతు లేకుండానే భారత్ ఈ రోజు మ్యాచ్ ఆడనుంది.

ఆర్టీ-పీసీఆర్ టెస్టులోనూ పాజిటివ్‌

ఆర్టీ-పీసీఆర్ టెస్టులోనూ పాజిటివ్‌

నాలుగో టెస్టులో భాగంగా మూడో రోజైన శనివారం రాత్రి (దాదాపు 8 గంటలకు) టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రికి నలతగా ఉందని చెప్పాడట. బీసీసీఐ వైద్య బృందం కరోనా వైరస్ టెస్టు చేయగా.. అందులో పాజిటివ్‌ వచ్చింది. ఆ విషయం తెలియగానే అతడితో సన్నిహితంగా మెలిగిన ఫిజియో థెరపిస్టు నితిన్‌ పటేల్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌లను ఐసోలేషన్‌కు పంపించారు.

ఇక ఆదివారం రవిశాస్త్రికి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయగా.. ఆ ఫలితం ఈ రోజు వచ్చింది. ఆర్టీ-పీసీఆర్ టెస్టులోనూ రవిశాస్త్రికి పాజిటివ్‌ అని తేలింది. దాంతో అతడు 10 రోజల పాటు ఐసొలేషన్‌లోకి ఉండనున్నాడు. మరోవైపు అరుణ్‌, శ్రీధర్‌లకు మరోసారి కరోనా టెస్టులు చేయనున్నారు. అందులో నెగటివ్ వస్తేనే జట్టుతో కలవనున్నారు.

ఐసొలేషన్‌లో శాస్త్రి

ఐసొలేషన్‌లో శాస్త్రి

హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక హోటల్ గదిలో ఐసొలేషన్‌లో ఉన్నాడు. బీసీసీఐ వైద్య బృందం అతడిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. కరోనా సోకడంతో రవిశాస్త్రి ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టుతో సహా సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న ఐదవ టెస్టుకు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం భారత జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాడు.

రాఠోడ్‌ ఇప్పుడు భారత జట్టును ముందుకునడిపించనున్నాడు. ఇంగ్లండ్, భారత్‌ జట్ల మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదవ రోజైన సోమవారం ఫలితం తేలే అవకాశం ఉంది.

ప్రపంచకప్‌ 2021తో ముగియనున్న కాంట్రాక్టు

ప్రపంచకప్‌ 2021తో ముగియనున్న కాంట్రాక్టు

వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2021తో భారత హెడ్ కోచ్ ర‌విశాస్త్రి కోచ్ పదవి కాలం ముగియనుంది. తన కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత జాతీయ జట్టుతో విడిపోవాలని యోచిస్తున్నట్లు కొంతమంది భారత క్రికెట్ బోర్డు సభ్యులకు రవిశాస్త్రి తెలియజేశాడని సమాచారం తెలుస్తోంది. ప్రపంచకప్‌ అనంతరం రవిశాస్త్రి కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.

విశ్రాంతి అనంతరం తన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించనున్నాడట. ఏదేమైనా మరోసారి రవిశాస్త్రి టీమిండియా కోచ్ పదవి చేపట్టేందుకు సముఖంగా లేడన తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్న విక్రమ్ రాథోడ్.. చీఫ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

2014లో జట్టు డైరెక్టర్‌గా ఎంపికయి

2014లో జట్టు డైరెక్టర్‌గా ఎంపికయి

2014లో జట్టు డైరెక్టర్‌గా రవిశాస్త్రి ఎంపికయ్యాడు. భారత 2016లో టీ20 ప్రపంచకప్‌ వరకు అదే పదవిలో కొనసాగాడు. ఆపై అనిల్ కుంబ్లే ఒక సంవత్సరం పాటు కోచ్ పదవి చేపట్టారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఉన్న విభేదాల కారణంగా కుంబ్లే తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. రవిశాస్త్రి కోచ్ పదవి చేపట్టాడు. రెండు సంవత్సరాలు విజయవంతమవ్వడంతో మరోసారి అతడినే కోచ్ పదవి వరించింది.

రవిశాస్త్రి హెడ్‌ కోచ్ అయిన త‌ర్వాత రెండుసార్లు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించింది కోహ్లీసేన. ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల్లో కూడా సిరీసులు కైవసం చేసుకుంది. 2019 ప్రపంచకప్‌లో సెమిస్ చేరింది. పొట్టి ప్రపంచకప్‌లలో కూడా మంచి ప్రదర్శనే చేసింది. ఇక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైన‌ల్‌కు కూడా చేరింది. రవిశాస్త్రి తన నాలుగేళ్ల పదవి కాలంలో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు.

Story first published: Monday, September 6, 2021, 16:01 [IST]
Other articles published on Sep 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+