Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ విషయంలో సిరాజ్ దురదృష్ణవంతుడు: ఆర్‌సీబీ డైరెక్టర్

 Mike Hesson Says Mohammed Siraj has been very unlucky on not getting chances in white-ball cricket

ముంబై: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) డైరెక్టర్ మైక్ హెస్సెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. సిరాజ్ అద్భుతమైన ఆటగాడని కొనియాడాడు. అయితే టీమిండియా తరఫున అతనికి రావాల్సిన అవకాశాలు రాలేదని, ఈ విషయంలో అతను దురదృష్టవంతుడని చెప్పుకొచ్చాడు. సిరాజ్ ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడని, ఫామ్‌లో ఉన్నా లేకపోయినా.. అతను ఒకేలా కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో ముంబై‌లో ఆర్‌సీబీ ప్రాక్టీస్ మొదలెట్టగా.. హిందూస్థాన్ టైమ్స్‌తో మైక్ హెస్సెన్ మాట్లాడు. ఈ క్రమంలోనే సిరాజ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'సాదారణంగా ఆటగాళ్లు అద్భతమైన ఫామ్‌లో ఉన్నప్పడు ఉత్సహంగా కనిపిస్తారు. సిరాజ్‌ మాత్రం ఫామ్‌లో ఉన్న లేక పోయినా ఎప్పడూ ఒకేలా ఉంటాడు. ఆర్‌సీబీ తరఫున ఆరంభంలో సిరాజ్ విఫలమయ్యాడు. కానీ ఆ తర్వాత తన పట్టుదలతో జట్టులో ఒక్కసారిగా స్టార్‌ బౌలర్‌గా ఎదిగాడు. ఇక భారత తరుపున అద్భుతమైన బౌలర్లలో సిరాజ్‌ ఒకడు. అయినప్పటకీ దురదృష్టవంతుడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే భారత తరుపున అంతగా అవకాశాలు అతనికి రావడం లేదు. భారత జట్టులో కావాల్సినంత పేసర్లు అందుబాటులో ఉండటంతో ఎ‍క్కువగా సిరాజ్‌ బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ వంటి వారికి ఇంకా అవకాశాలు ఇస్తున్నారు.

అయితే కొంతమంది భారత పేసర్లు తమ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నారు. వారి రిటైర్మెంట్ అనంతరం సిరాజ్‌ భారత పేస్‌ బౌలింగ్‌ విభాగాన్ని లీడ్‌ చేస్తాడు.'అని హెస్సన్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు సిరాజ్‌ను రూ. 7 కోట్లకు ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 26 నుంచి ఐపీఎల్‌-2022 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోలకతా నైట్‌రైడెర్స్‌ తలపడనుండగా... పంజాబ్ కింగ్స్‌తో ఆర్‌సీబీ తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది.

కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. ఓ ఆటగాడిగా ఎలా రాణిస్తాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అతనికి తోడు గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఉండగా.. సిరాజ్, హర్షల్ పటేల్‌లతో టీమ్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది.

Story first published: Friday, March 18, 2022, 19:44 [IST]
Other articles published on Mar 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+