IPL 2021 Auction: చెన్నైతో పోటీ ముందే ఊహించి.. మాక్స్‌వెల్ కోసం బెంగళూరు ప్రణాళిక!!

బెంగళూరు: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈనెల 18న చెన్నైలో జరిగిన ఐపీఎల్ 2021 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ మ్యాక్సీని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అతని కోసం ముఖ్యంగా బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి బెంగళూరే అతన్ని భారీ మొత్తానికి దక్కించుకుంది.

చెన్నై, బెంగళూరు పోటీ
రూ.5 కోట్ల నుంచి చెన్నై, బెంగళూరు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం పోటీపడ్డాయి. అయితే చెన్నై వద్ద తక్కువ మొత్తమే ఉండటంతో రూ.14 కోట్ల వరకు ప్రయత్నించి చివరకు వదిలేసింది. వేలంలో మ్యాక్సీని దక్కించుకోవడానికి ఆర్సీబీ ముందే కచ్చితమైన ప్రణాళికతో ముందుకొచ్చింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను ఆర్సీబీ బోల్డ్ డైరీస్ పేరిట సోమవారం ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. అందులో ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ మాట్లాడుతూ వేలంలో చెన్నై నుంచి తమకు ఎదురయ్యే పోటీని ముందే పసిగట్టాడు.

చెన్నైతో పోటీ ఉంటుందని ముందే పసిగట్టి
'మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఎంత ప్రమాదకరమైన ఆటగాడో అందరికీ తెలిసిందే. 10-15 ఓవర్ల మధ్య అతడు బ్యాట్‌తో బౌండరీల మోత మోగిస్తాడు. అంతేకాదు బంతితోనూ జట్టుకు ఉపయోగపడతాడు. 2014 నుంచి అతని సగటు 28, స్ట్రైక్ రేట్ 161.5గా ఉంది. టాప్ ఆరుగురు ఆటగాళ్లలో ఇలాంటి ఆటగాడు ఒకరు అవసరం. అయితే వేలంలో మాక్సీని చేజిక్కించుకునే విషయంలో చెన్నై నుంచి గట్టి పోటీ ఉంటుందని ముందే ఊహించాం. అందుకు ముందే సిద్దమయ్యాం. ప్రణాళిక ప్రకారమే భారీ ధరకు కొనుగోలు చేశాం' అని మైక్ హెసన్ తెలిపాడు. అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఈ వీడియోపై స్పదించాడు. మ్యాక్సీని కొనుగోలు చేయడం పెద్ద రిస్క్ అని పేర్కొన్నాడు.

13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే
గ్లెన్ మాక్స్‌వెల్ చాలా కాలంగా ఐపీఎల్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల తరఫున ఇదివరకు ఆడాడు. 2020 సీజన్‌కు పంజాబ్ అతడిని రూ.10.75 కోట్ల అత్యధిక ధరకు కొనుగోలు చేయగా తీవ్రంగా నిరాశ పరిచాడు. 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేశాడు. సిక్సర్ల కింగ్ అని పేరున్న మ్యాక్సీ.. టోర్నీ ఆసాంతం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. కోట్లు వెచ్చించి మరీ తీసుకున్న ఆ జట్టు అంచనాలను పూర్తిగా తలకిందులు చేశాడు. దీంతో అతడి ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పంజాబ్ అతడిని వదిలేసింది.

ఎలా ఆడతాడో చూడాలి
ఐపీఎల్ 2021 వేలానికి రెండు రోజుల ముందు మాక్స్‌వెల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బెంగళూరు సారథి విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టమని, అతని సారథ్యంలో ఆడేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపాడు. 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్ కూడా తనకు ఇష్టమైన ఆటగాడని మ్యాక్సీ పేర్కొన్నాడు. అనుకున్నట్టుగానే బంగళూరు జట్టుకు అతడు ఆడనున్నాడు. రాబోయే సీజన్‌లో ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఎలా ఆడతాడో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
15 ఏళ్ల తర్వాత.. ఐదు వికెట్లు తీసిన శ్రీశాంత్!!