ఆ ముగ్గురు అనామక ఆటగాళ్లు ఈ సారి దుమ్ములేపుతారు: ఆర్‌సీబీ డైరెక్టర్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అనామక ఆటగాళ్లు రజత్ పటిదార్, సుయాశ్ ప్రభుదేశాయ్, మహ్మద్ అజారుద్దీన్‌లు దుమ్ములేపుతారని ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ మైక్ హెసెన్ తెలిపాడు. ఫిబ్రరిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఈ ముగ్గురిని ఆర్‌సీబీ వారి కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
అయితే ఈ ముగ్గురు ఆటగాళ్లు దేశవాళీ ప్రతిష్టాత్మ టోర్నీలు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీల్లో అదరగొట్టారు. తాజాగా హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముగ్గురు ఆటగాళ్ల గురించి ప్రస్తావించిన మైక్ హెసేన్.. ఈ సీజన్ ఐపీఎల్‌తో స్టార్లుగా ఎదుగుతారని జోస్యం చెప్పాడు.

పటిధార్ టాప్ బ్యాట్స్‌మన్..
'రజత్ పటిదార్‌కు ఇది తొలి ఐపీఎల్. 27 ఏళ్ల అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ వ్యవస్థను బాగా అర్థం చేసుకున్నాడు. అతనో టాప్ క్లాస్ బ్యాట్స్‌మన్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారేలో అద్భుతంగా రాణించాడు. గత రెండేళ్లుగా అతన్ని మేం పరిశీలిస్తున్నాం'అని హెసెన్ చెప్పుకొచ్చాడు. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడే పటిదార్ టీ20 స్ట్రైక్‌రేట్ 143.53. ఇప్పటి వరకు 22 టీ20 మ్యాచ్‌లు ఆడిన పటిదార్ 34.95 సగటుతో 6 హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోర్ 96.

విధ్వంసకర శతకంతో..
దేశవాళీలో దుమ్మురేపిన మరో ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్ అని, భీకర బ్యాటింగ్‌తో అందరి దృష్టి ఆకర్షించాడని ఆర్‌సీబీ డైరెక్టర్ కొనియాడాడు. 'మహ్మద్ అజారుద్దీన్ అసాధారణమైన ఆటగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైపై శతకంతో చెలరేగి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ మ్యాచ్ ప్రత్యక్షప్రసారం కావడంతో తనదైన రోజు అతను ఏం చేయగలడో అందరూ చూశారు.'అని తెలిపాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైపై అజారుద్దీన్ 137 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా హాఫ్ సెంచరీలతో రాణించాడు.

మరో 360 ప్లేయర్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తాచాటిన ఆటగాళ్లలో నలుగురు ఐపీఎల్‌కు ఎంపికయ్యారని అందులో ప్రభుదేశాయ్ ఒకడని మైక్ హెసెన్ చెప్పుకొచ్చాడు. అతనో అద్భుతమైన ఫినిషరని కితాబిచ్చాడు. 'గోవా నుంచి నలుగురు ఆటగాళ్లు ఐపీఎల్‌కు వచ్చారు. వారిలో ప్రభుదేశాయ్ ఒకడు. అతను అద్భుతమైన ఫినిషర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను అన్ని రకాల షాట్స్ ఆడాడు. మైదానం నలుమూలల చెలరేగగలడు. చూడ్డానికి మాములుగా కనిపించిన పరుగుల సునామీ సృష్టించగలడు. ఇక ఫీల్డింగ్ పరంగా మేం గతేడాది చాలా మెరుగైన ప్రదర్శన ఇచ్చాం. ఈ సారి అంతకు మించి ప్రదర్శనను చూస్తారు'అని మైక్ హెసెన్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications