Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే అప్పుడు చాహల్‌ను తీసుకోలేదు: ఆర్‌సీబీ మాజీ హెడ్ కోచ్

ఐపీఎల్ 2022 మెగా వేలంలో యుజ్వేంద్ర చాహల్‌ను కొనుగోలు చేయకపోవడానికి గల కారణాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్(ఆర్‌సీబీ) మాజీ హెడ్ కోచ్ మైకే హెస్సెన్ తెలిపాడు. మార్క్యూ ప్లేయర్ల జాబితాలో అతను లేకపోవడంతోనే జట్టులోకి తీసుకోలేకపోయామని చెప్పాడు. సుదీర్ఘ కాలం పాటు ఆర్‌సీబీకి ఆడిన చాహల్‌ను తిరిగి కొనుగోలు చేయకపోవడంతో అతను తీవ్ర అసంతృప్తికి గురయ్యాడని మైక్ హెస్సెన్ గుర్తు చేసుకున్నాడు.

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు ఆర్‌సీబీ విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను మాత్రమే రిటైన్ చేసుకుంది. వేలంలో ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఆర్‌సీబీ.. చాహల్‌ను మాత్రం పట్టించుకోలేదు. కనీసం బిడ్ కూడా వేయలేదు. అతనికి బదులు శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా రూ. 10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

Mike Hesson explains why RCB couldn’t buy Yuzvendra Chahal back at IPL 2022 auction

ఈ నిర్ణయంపై అప్పట్లో యుజ్వేంద్ర చాహల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్‌ను తీసుకోకపోవడానికి గల కారణాలను అప్పటి ఆర్‌సీబీ డైరెక్టర్ మైక్ హెస్సెన్ వివరించాడు. 'ఐపీఎల్ 2022 మెగా వేలం తర్వాత చాహల్‌తో మాట్లాడే ప్రయత్నం చేశాను. కానీ అతను ఫోన్ ఎత్తలేదు. తీవ్ర నిరాశకు గురయ్యాడు.

అక్కడి పరిస్థితులను అతనికి వివరించడం కష్టమే. నాతో మాట్లాడేందుకు కూడా అతను ఆసక్తి చూపలేదు. ఈ విషయంలో అతన్ని నేను నిందించడం లేదు. ఓ ఆర్‌సీబీయన్‌గా అతను తీవ్ర అసహనానికి గురయ్యాడు. అయితే మేం ఎదుర్కొన్న సమస్యలు అతనికి బాగా తెలుసు. మేం ముగ్గురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకున్నాం. వేలంలో హర్షల్ పటేల్‌తో పాటు యుజ్వేంద్ర చాహల్‌ను తిరిగి కొనుగోలు చేయాలనుకున్నాం.

ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం ద్వారా లభించిన రూ.4 కోట్లను వేలంలో ఉపయోగించుకోవచ్చని భావించాం. అయితే మార్క్యూ ప్లేయర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ లేడు. అతను ఆరో సెట్‌లో ఉన్నాడు. అప్పటి వరకు చాహల్‌ను కోనుగోలు చేసేంత డబ్బు ఫ్రాంచైజీ దగ్గర మిగల్లేదు. ఐపీఎల్‌లోనే అత్యుత్తమ స్పిన్నర్ అయిన చాహల్ మార్క్యూ ప్లేయర్ల జాబితాలో లేకపోవడం దారుణం.

నెంబర్ 65 ప్లేయర్‌గా అతని పేరు వచ్చింది. ఆ సమయంలో అతను మాకు లభిస్తాడా? లేదా? అనే గ్యారంటీ లేదు. మాక్ ఆక్షన్‌లో యుజీని తీసుకోవడంపై తీవ్రంగా చర్చించాం. చాహల్ దక్కుతాడో లేదో అనే సందేహంతో ముందుగానే వానిందు హసరంగాను తీసుకున్నాం. 'అని మైక్ హెస్సెన్ అన్నాడు.

ఆ వేలంలో యుజ్వేంద్ర చాహల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.6.5 కోట్ల ధరకు కొనుగోలు చేసింది. ఆర్‌సీబీ తరఫున 113 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 139 వికెట్లు తీసాడు.

Story first published: Tuesday, February 20, 2024, 11:56 [IST]
Other articles published on Feb 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+